పట్టణంలోని పలు మండపాలలో ఏర్పాటు చేసిన గణనాధులను దర్శించుకొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

monditoka jagan mohan rao monditoka arun kumar ysrcp nandigama nandigama ysrcp mla
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.31-8-2022 (బుధవారం) ..

పట్టణంలోని పలు మండపాలలో ఏర్పాటు చేసిన గణనాధులను దర్శించుకొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి ..

నందిగామ పట్టణంలోని 17 వ వార్డు – 18 వ వార్డు మరియు గీతా మందిరం -అనాసాగరం – కార్ స్టాండ్ – యాదవ బావి మరియు పలు వార్డులలో ప్రత్యేక మంటపాలలో ఏర్పాటుచేసిన గణనాధులను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు , ముందుగా ఆయా మంటపాల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారికి పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ,గణనాధుని ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు , మహాగణపతి కరుణాకటాక్షాలతో నందిగామ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని – మంచి పనులకు అడ్డంకిగా మారిన విఘ్నాలన్ని తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ,

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *