



ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.13-7-2022(బుధవారం) ..
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు బదిలీపై వచ్చిన ఉద్యోగులు ..
నందిగామ పట్టణంలోని శాసనసభ్యుల వారి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ D.E మల్లాది శ్రీనివాస రావు గారు మరియు బదిలీపై వచ్చిన PR PIU (ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్) AE లు , మరియు పలువురు వి.ఆర్వో.లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేస్తూ , ప్రజలకు మంచి చేకూరేలా – ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ,ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పనిచేయాలని సూచించారు ..