AIBE 19 Results 2025 : ‘లా’ అభ్యర్థులకు అలర్ట్… ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

AIBE 19 Results 2025 : ‘లా’ అభ్యర్థులకు అలర్ట్… ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

All India Bar Examination XIX Results: ఏఐబీఈ 19 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మార్చి 6వ తేదీన ఫైనల్ కీ రాగా… శుక్రవారం ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

 
ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
 

ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ (ఏఐబీఈ 19)కు సంబంధించిన ఫలితాలు వచ్చేశాయ్…! శుక్రవారం సాయంత్రం తర్వ ఈ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు ఏఐబీఈ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

 

AIBE 19 ఫలితాలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • పరీక్ష రాసిన అభ్యర్థులు AIBE వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే AIBE XIX Result ఆప్షన్ పై నొక్కాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజల్ట్ కాపీని పొందవచ్చు.

 

ఈ పరీక్షను గతేడాది డిసెంబర్ 22వ తేదీన నిర్వహించారు. ఆ వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఆ తర్వాత మార్చి 6వ తేదీన ఫైనల్ కీని ప్రకటించారు. తాజాగా తుది ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇక ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు.

వంద మార్కులకు పరీక్ష నిర్వహించగా… ఇందులో 7 ప్రశ్నలు తప్పుగా వచ్చినట్లు AIBE అధికారులు ప్రకటించారు. దీంతో జనరల్, ఓబీసీ అభ్యర్థుల అర్హత మార్కులను 42 గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 37 మార్కులుగా ఉంది. ఇందుకు అనుగుణంగా… తుది ఫలితాలను విడుదల చేశారు.

 

ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా AIBE -19 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు….

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024