



Best Web Hosting Provider In India 2024

Atukula Upma: ఉదయాన్నే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ట్రై చేస్తున్నారా? అటుకులు, పల్లీలతో ఇలా చేసేయండి!
Atukula Upma: ఉదయాన్నే ఈజీగా, హెల్తీగా ఏదైనా తినాలకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం అందరికీ నచ్చే అటుకులతో, రుచికరమైన పల్లీలతో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేయండి. కొద్ది క్షణాల్లోనే రెడీ చేసుకునేందుకు ఈ రెసిపీను ఫాలో అవ్వండి.

అటుకులు, పల్లీలతో చేసిన రుచికరమైన ఉప్మా
మార్నింగ్ టైం చాలా బిజీగా ఉంటారు. కానీ, టిఫిన్ లేదా బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా కావాలని ఇంట్లో పిల్లలు మారాం చేస్తున్నారా? మీ ఇంట్లో వారు ఆఫీసుకు వెళ్లేందుకు త్వరత్వరగా టిఫిన్ బాక్స్ రెడీ చేసుకుంటున్నారా? అయితే మీకు కరెక్ట్ ఆప్షన్ ఈ అటుకుల ఉప్మా. త్వరగా తయారు చేసుకోగలగడంతో పాటు చక్కటి పోషక విలువలతో కూడి ఉంటుంది. ఇంకా దీనిని తినడం వల్ల జీర్ణక్రియకు సులభమైన ఆహారం అందించిన వారవుతారు కూడా.
మరి పల్లీలతో తయారుచేసుకునే అటుకుల ఉప్మా వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
- కేవలం అరగంటలో రెడీ చేసుకోగల పల్లీ అటుకుల ఉప్మా వల్ల శరీరానికి అనేక పోషకాలు సమకూరుతాయి.
- వేరుశనగలో ప్రోటీన్, ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ E, థయామిన్, నయాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
- ఈ పోషకాలతో మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వారవుతారు.
- ఇక లేటెందుకు, కరకరలాడే రుచికరమైన ఉప్మాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి.
పల్లీ – అటుకుల ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
- అటుకులు – 250 గ్రాములు;
- పెద్ద ఉల్లిపాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి);
- పల్లీలు – అర కప్పు
- పచ్చిమిర్చి – 2;
- జీలకర్ర పొడి – 2 టీస్పూన్లు;
- కంది పప్పు – 2 టీస్పూన్లు;
- కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్;
- అల్లం – అంగుళం ముక్క
- పసుపు – పావు టీ స్పూన్
- నూనె – ఒక టేబుల్ స్పూన్;
- కరివేపాకు, ఆవాలు, ఉల్లిపాయలు – తాలింపుకు సరిపడ
- కొత్తిమీర – కొద్దిగా;
- నిమ్మరసం – ఒక టీస్పూన్;
- ఉప్పు – అవసరమైనంత,
- నీరు – మూడు కప్పులు
పల్లీ – అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం:
- వేరుశనగలను ముందు రోజు 12 గంటల వరకూ నానబెడితే మంచిది. లేదంటే, వంట చేయడానికి కనీసం కొన్ని గంటల ముందు వరకైనా నానబెట్టుకోండి.
- మరోవైపు అటుకులను శుభ్రం చేసి, నీరు వడబోసి వేరుగా ఉంచండి.
- ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక కడాయి ఉంచండి. అందులో కాస్త నూనె వేసి ఆవాలు, కందిపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించండి.
- ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించండి.
- ఇప్పుడు శుభ్రం చేసి ఉంచుకున్న అటుకులను కడాయిలో వేసి, అల్లం, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపండి.
- బాగా కలిశాయని కన్ఫమ్ చేసుకున్న తర్వాత అందులో మూడు కప్పుల నీరు పోసి, కొంత సేపు మూతపెట్టి ఉడికించండి.
- తర్వాత, ముందుగా నానబెట్టుకున్న వేరుశనగలను వేసి, నిమ్మరసం, కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి బాగా కలపండి.
- అలా ఓ 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆపేయండి.
- అంతే, రుచికరమైన, పోషకాహారమైన పల్లీ – అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్లే. ఇక వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే.
పల్లీ – అటుకుల ఉప్మా కేవలం బ్రేక్‌ఫాస్ట్ కోసమే కాదు, సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా కూడా మంచి ఆప్షన్.
సంబంధిత కథనం