నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణనాధుని విగ్రహాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం సాయంత్రం దర్శించుకుని ,ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని గాంధీ సెంటర్ ఉత్సవ కమిటీ వారు ఘనంగా సత్కరించారు , ఈ కార్యక్రమంలో సిఐ కనకారావు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..