




ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.01-9-2022(గురువారం) ..
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితికి స్వస్తి పలికి – అర్హులను గుర్తించి నేరుగా వారి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు గ్రామంలోని సచివాలయం-1 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం రాత్రి ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని , ఏ ఇంటికి వెళ్ళినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు- ప్రభుత్వ పని తీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు , అదేవిధంగా గ్రామాలలో ప్రధానంగా తాగునీరు -డ్రైన్ లు- సిమెంట్ రోడ్ల తో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు , గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించేందుకు ప్రజల వద్దకే తమ ప్రభుత్వం వస్తుందని చెప్పారు , గత మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు ఓర్వలేక నిత్యం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ ,కందుల నాగేశ్వరరావు, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు ..