ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
గ్రామంలోని బీసీ హాస్టల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం రాత్రి స్థానిక బీసీ హాస్టల్ ను సందర్శించి ,విద్యార్థులతో మాట్లాడారు ..
ఈ సందర్భంగా ఆయన స్థానిక హాస్టల్ లోని గదులను- వంటశాలను, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు , ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా ? లేదా అనే విషయంపై విద్యార్థులను ఆరా తీశారు ,విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని – రుచికరమైన ,పౌష్టికరమైనా ఆహారాన్ని విద్యార్థులకు అందజేయాలని వార్డెన్ ను ఆదేశించారు ,వంటశాలను – హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని , విద్యార్థులను జాగ్రత్తగా పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు ,
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..