



Best Web Hosting Provider In India 2024
TG BC Vidya Nidhi Scheme : బీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా అప్లై చేసుకోవాలి
TG BC Vidya Nidhi Scheme : వచ్చేనెల 1వ తేదీ నుంచి బీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 30వ తేదీ వరకూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా.. విదేశాల్లో చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.
మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద.. విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి వివరించారు.
డిగ్రీలో 60 శాతం మార్కులతోపాటు ఈ ఏడాది జులై 1 నాటికి 35 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అప్లై చేసుకునే వారి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా.. ఎంపికైన విద్యార్థులకు విదేశాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు.
అర్హతలు..
దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ లేదా ఈబీసీ విద్యార్థి అయి ఉండాలి.
దరఖాస్తుదారుని కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలకు మించకూడదు.
దరఖాస్తుదారుని వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తుదారుడు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశాల కోసం ఐ-20 ఇన్విటేషన్, వీసాలు కలిగి ఉండాలి.
ప్రయోజనాలు..
ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది.
వీసా, ప్రయాణ ఖర్చులకు 50 వేల రూపాయలు ఇస్తారు.
దరఖాస్తు విధానం..
ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://telanganaepass.cgg.gov.in లింక్‌పై క్లిక్ చేస్తే.. ఓవర్సిస్ స్కాలర్‌షిప్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సిస్ విద్యా నిధి ఫర్ బీసీ అండ్ ఈబీసీ పథకాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి.. వివరాలు పూరించాలి. ఆ తర్వాత సబ్‌మిట్ చేయాలి.
అవసరమైన పత్రాలు..
కుల ధృవీకరణ పత్రం.
ఆదాయ ధృవీకరణ పత్రం.
జనన ధృవీకరణ పత్రం.
ఆధార్ కార్డు.
ఈపాస్ ఐడి నంబర్.
నివాస/నేటివిటీ సర్టిఫికేట్.
పాస్‌పోర్ట్ కాపీ.
టెన్త్/ ఇంటర్/ గ్రాడ్యుయేట్/ పీజీ స్థాయి నుండి మార్క్ షీట్.
చెల్లుబాటు అయ్యే టోఫెల్/ ఐఫెల్, జీఆర్ఈ/ జీమ్యాట్ స్కోర్‌కార్డ్.
విదేశీ విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ ఆఫర్ లెటర్
నేషనలైజ్డ్ బ్యాంక్ పాస్ బుక్ కాపీ.
ఫోటోగ్రాఫ్.
టాపిక్