



Best Web Hosting Provider In India 2024
TDP vs TDP in Tiruvuru : టీడీపీ వర్సెస్ టీడీపీ.. తిరువూరులో ముదిరిన పోరు.. కొలికపూడిపై పార్టీ సీరియస్!
TDP vs TDP in Tiruvuru : తిరువూరు రాజకీయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు పార్టీకి డెడ్‌లైన్ విధించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అధిష్టానం ముగ్గురు సభ్యులతో నివేదిక తెప్పించింది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ టీడీపీలో కాకరేపుతోంది. పార్టీ నేత రమేశ్ రెడ్డిపై తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల కిందట ప్రకటించారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇవాళ 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తయ్యింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
అధిష్టానం సీరియస్..
మరోవైపు కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో నివేదిక తెప్పించిన అధిష్టానం.. కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరువూరు పార్టీ వ్యవహారాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసింది. కేశినేని చిన్ని, నెట్టెం రఘురామ్, మంతెనతో కమిటీ ఏర్పాటైంది. పార్టీకే అల్టిమేటం ఇవ్వడంపై కమిటీ ఆరా తీస్తోంది. ఈ కమిటీ పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇవ్వనుంది.
వివాదం ఏంటి..
ఇటీవల ఓ ఆడియో లీక్ అయ్యింది. అది తెలుగుదేశం పార్టీ నాయకుడిది అని ప్రచారం జరిగింది. ఆ ఆడియోలో ‘లోన్ ఇప్పిస్తే నాతో ఎంజాయ్ చేయాలి’ అని ఓ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారు. ఈ ఆడియో వైరల్ అయ్యింది. అలా మాట్లాడింది తిరువూరు ఏఎంసీ మాజీ ఛైర్మన్ అలవాల రమేశ్ రెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి. లోన్ వస్తే తనతో ఎంజాయ్ చేయాలని.. ఇంతకుముందు కూడా ఓ మహిళతో ఇలానే ఎంజాయ్ చేశానని ఆ ఆడియోలో ఉంది.
కొలికపూడి ఆగ్రహం..
ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓ గిరిజన మహిళతో ఇలా మాట్లాడటం మంచిది కాదు. ఇలాంటిది రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగితే ఎలా. అలా మాట్లాడిన వ్యక్తిపై పార్టీ 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే నేనే రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్యే కొలికపూడి స్పష్టం చేశారు.
రూ.2 కోట్లు అడిగారు..
ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై ఏఎంసీ మాజీ ఛైర్మన్ రమేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నన్ను రెండు కోట్ల రూపాయలు అడిగారు. మండలంలో కాంట్రాక్టులన్నీ నన్నే చేసుకోమన్నారు. కాంట్రాక్ట్ పనుల్లో 10 శాతం కమీషన్ ఇస్తే చాలన్నారు. నేను రెండు కోట్ల రూపాయలు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి నన్ను టార్గెట్ చేశారు’ అని రమేష్ రెడ్డి ఆరోపించారు.
గతంలోనూ..
ఇప్పుడే కాదు.. గతంలోనూ కొలికపూడి తీరుపై విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడిన తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారని.. ఆత్మహత్యాయత్నానికి ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో బయటకు రాకుండా కొలికపూడి నిన్న అందరినీ బెదిరించారని ఆరోపణలు వచ్చాయి.
సంబంధిత కథనం
టాపిక్