Kamakshi Bhaskarla: పొలిమేర 3 క‌న్ఫామ్ – మూడు సినిమాల‌తో టాలీవుడ్‌లో డాక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ కామాక్షి భాస్క‌ర్ల బిజీ

Best Web Hosting Provider In India 2024

Kamakshi Bhaskarla: పొలిమేర 3 క‌న్ఫామ్ – మూడు సినిమాల‌తో టాలీవుడ్‌లో డాక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ కామాక్షి భాస్క‌ర్ల బిజీ

Nelki Naresh HT Telugu
Published Mar 29, 2025 02:48 PM IST

డాక్ట‌ర్ నుంచి యాక్ట‌ర్‌గా మారిన కామాక్షి భాస్క‌ర్ల టాలీవుడ్‌లో వ‌రుస‌గా సినిమాలు అంగీక‌రిస్తోంది. ప్ర‌స్తుతం మూడు సినిమాలు చేస్తోంది. పొలిమేర 3తో పాటు అల్ల‌రి న‌రేష్ 12ఏ రైల్వే కాల‌నీ సినిమాల‌తో పాటు న‌వీన్‌చంద్ర‌తో ఓ మూవీ చేస్తోం

కామాక్షి భాస్క‌ర్ల
కామాక్షి భాస్క‌ర్ల

డాక్ట‌ర్లు…యాక్ట‌ర్లుగా మారే ట్రెండ్ టాలీవుడ్‌లో పెరిగిపోయింది. సాయిప‌ల్ల‌వి, శ్రీలీల‌తో ప‌లువురు హీరోయిన్లు వైద్య విద్య అభ్య‌సిస్తూనే హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఆ లిస్ట్‌లో కామాక్షి భాస్క‌ర్ల కూడా ఉంది. తెలుగులో హీరోయిన్‌గానే కాకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ ప్ర‌తిభ‌ను చాటుకుంటోంది.

ప్ర‌స్తుతం తెలుగులో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతన్న హారర్ థ్రిల్లర్ మూవీ 12A రైల్వే కాలనీలో న‌టిస్తోంది. ఇటీవలే నవీన్ చంద్రతో కొత్త సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాది. మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్న‌ది. మ‌రికొన్ని సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ట్లు కామాక్షి తెలిపింది.

మూడు సినిమాలు..

కామాక్షి భాస్క‌ర్ల మాట్లాడుతూ.. ‘12 ఏ రైల్వే కాల‌నీ, పొలిమేర 3తో పాటు న‌వీన్ చంద్ర మూవీస్‌ల‌లో నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా సినీ కెరీర్‌కు చాలా కీలకం కానున్నాయి. ఇలా ఒకే టైంలో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ప్యాషన్‌, ప్రేమ ఉండటంతో కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాకు సినిమా సెట్లలో ఉండటమే ఇష్టంగా ఉంటుంది’ అని అన్నారు.

స‌వాల్ విసిరే క్యారెక్ట‌ర్స్‌…

12A రైల్వే కాలనీ అయినా, పొలిమేర అయినా, సైతాన్ అయినా కామాక్షి తన నటనతో చెరగని ముద్ర వేశారు. డిఫరెంట్ పాత్రలను చేయ‌డంపై కామాక్షి భాస్క‌ర్ల మాట్లాడుతూ ‘సినిమాలోని పాత్రకు కనెక్ట్ అవ్వడం, ఆ కారెక్టర్‌కు నిజాయితీగా ఉండటం వల్ల యాక్టర్‌ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు.

సవాల్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎంచుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగానే పని చేస్తూ వస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను.నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నేను నమ్ముతాను’ అని చెప్పింది.

సినిమాలు…వెబ్‌సిరీస్‌లు…

ఎంబీబీఎస్ పూర్తిచేసిన కామాక్షి భాస్క‌ర్ల డాక్ట‌ర్‌గా చాలా కాలం పాటు ప‌నిచేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ప్రియురాలు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మా ఊరి పొలిమేర‌, పొలిమేర 2 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఇట్టు మారేడుమిల్లి ప్ర‌జానికం, విరూపాక్ష‌తో పాటు ప‌లు మూవీస్‌లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. సినిమాలే కాకుండా తెలుగులో దూత‌, సైతాన్‌, ఝాన్సీ వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024