Biopic Movie: డొక్కా సీత‌మ్మ బ‌యోపిక్‌లో ఆమ‌ని – డైరెక్ట‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని

Best Web Hosting Provider In India 2024

Biopic Movie: డొక్కా సీత‌మ్మ బ‌యోపిక్‌లో ఆమ‌ని – డైరెక్ట‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని

Nelki Naresh HT Telugu
Published Mar 29, 2025 10:24 PM IST

Biopic Movie: గోదావ‌రి జిల్లాల్లో నిత్యాన్న‌దాత‌గా పేరు తెచ్చుకున్న పేరుగాంచిన డొక్కా సీత‌మ్మ జీవితం ఆధారంగా తెలుగులో ఓ మూవీ రాబోతుంది. సీనియ‌ర్ హీరోయిన్ ఆమని టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీకి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ ఖ‌రారు చేశారు. త్వ‌ర‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

డొక్కా సీత‌మ్మ బ‌యోపిక్‌
డొక్కా సీత‌మ్మ బ‌యోపిక్‌

Biopic Movie: టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ఆమని తెలుగులో ఓ బ‌యోపిక్ మూవీ చేస్తోంది. గోదావ‌రి జిల్లాల్లో నిత్యాన్న‌దాత‌గా పేరు తెచ్చుకున్నడొక్కా సీత‌మ్మ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ మూవీకి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

ఈ సినిమాలో సీనియ‌ర్ యాక్ట‌ర్ ముర‌ళీమోహ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. వల్లూరి రాంబాబు నిర్మిస్తున్న ఈ మూవీకి టి.వి. రవి నారాయణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్‌ను శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

నాలుగు వంద‌ల ఎక‌రాలు అమ్మేసి…

అంబికా కృష్ణ మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలి జీవిత క‌థ‌తో సినిమా తీస్తుండటం ఆనంద‌దాయ‌కం. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని, విషయాల్ని సినిమాల ద్వారా చూపిస్తే అందరికీ తెలుస్తుంది. . నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు. ఆమని గారు చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుంది. ఇదొక గొప్ప చిత్రం కానుందనిపిస్తుంది’ అని పేర్కొన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని

దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ .. ‘చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి 2012లో వచ్చాను. . డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఒక అభిమానిగా ఆ సినిమాను తీసి చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు అంకితం చేద్దాం అనుకున్నాను. డొక్కా సీతమ్మ గారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ప్రారంభించాం. డబ్బు కోసం నేను ఈ సినిమాను మొదలుపెట్టలేదు.

కేవలం పవన్ కళ్యాణ్ , చిరంజీవి అభిమానిగా ఓ మహనీయురాలి చరిత్రను తెలుగువాళ్లు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా మొదలుపెట్టాం. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల‌కు విరాళంగా ఇస్తాం.

మొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం.చంద్రబోస్ గారు ఇచ్చిన మాట సాయంతోనే ఈ సినిమా స్థాయి పెరిగింది” అని తెలిపాడు.

నేష‌న‌ల్ అవార్డ్‌..

‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు డొక్కా సీత‌మ్మ‌. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆమనికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి’ అని ముర‌ళీమోహ‌న్ అన్నారు.

ఆమని మాట్లాడుతూ .. ‘దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ గారి కథను చెప్పారు. నేను బెంగళూర్‌లో పుట్టి పెరిగాను. నాకు డొక్కా సీత‌మ్మ‌ గురించి ఎక్కువగా తెలియ‌దు. దర్శకుడు కథ చెప్పిన తరువాత గూగుల్‌లో ఆమె గురించి సర్చ్ చేశాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకు అర్థమైంది. ఇలాంటి పాత్రలను చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం” అని తెలిపింది.త్వ‌ర‌లోనే ఈ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత పేర్కొన్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024