





Best Web Hosting Provider In India 2024

Mad Square Day 2 Collections: కలెక్షన్లలో దుమ్మురేపిన మ్యాడ్ స్క్వేర్.. రెండు రోజుల్లోనే బ్రేక్‍ఈవెన్! ఎన్ని కోట్లంటే..
Mad Square Day 2 Collections: మ్యాడ్ స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రెండో రోజు కూడా మంచి వసూళ్లను సాధించింది. అంచనాలను మించి అదరగొడుతోంది.

మ్యాడ్ స్క్వేర్ సినిమా చాలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన మ్యాడ్‍కు సీక్వెల్ కావటంతో విపరీతమైన హైప్ మధ్య రిలీజైంది. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ చేసిన మ్యాడ్ స్క్వేర్ ఈ శుక్రవారం మార్చి 28న విడుదలైన బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. రెండో రోజు కూడా అదరగొట్టింది.
రెండు రోజుల కలెక్షన్లు ఇవే
మ్యాడ్ స్క్వేర్ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు (మార్చి 30) వెల్లడించింది. బ్లాక్‍బస్టర్ మ్యాడ్ స్క్వేర్, హ్యాపీ ఉగాది అంటూ కలెక్షన్ల లెక్కతో పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. థియేటర్లలో మ్యాడ్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయంటూ రాసుకొచ్చింది.
తొలి రోజు రూ.20.8 కోట్ర గ్రాస్ కలెక్షన్లు సాధించిన మ్యాడ్ స్క్వేర్ రెండో రోజు అదే జోష్ చూపించింది. సుమారు రూ.16.4 కోట్లతో అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ చూపించింది. మూడో రోజైన ఆదివారం ఉగాది పండుగ కూడా ఉండడంతో మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ ఉంది. సోమవారం రంజాన్ సెలవు కావడం కూడా కలిసి వచ్చే అంశంగా ఉంది. మొత్తంగా మిక్స్డ్ టాకే వచ్చిన కామెడీతో మెప్పించటంతో మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్లలో అదరగొడుతోంది.
అప్పుడే బ్రేక్‍ఈవెన్.. ఫస్ట్ పాస్ట్ వసూళ్లు క్రాస్
మ్యాడ్ స్క్వేర్ సినిమా రెండు రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేక్ఈవెన్ సాధించినట్టు తెలుస్తోంది. ఆదివారం లెక్కలతోనే ప్రాఫిట్ జోన్‍లోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే, రెండేళ్ల క్రితం మ్యాడ్ మూవీ ఓవరాల్‍గా దాదాపు రూ.24కోట్ల కలెక్షన్లు దక్కించుకుంటే.. ఇప్పుడు సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ రెండో రోజుల్లోనే రూ.37కోట్లను సాధించి ఆ మార్కును భారీగా దాటేసింది. ఇంకా జోరు కొనసాగే ఛాన్స్ ఉంది.
మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. కామెడీ విషయంలో మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేశారు. సంతోష్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ మరోసారి కామెడీ టైమింగ్‍తో అదరగొట్టారు. మరో ప్రధాన పాత్ర పోషించిన విష్ణు ఓయ్ బాగా మెప్పించారు. మురళీధర్ గౌడ్, ప్రియాంక జవల్కర్, రఘుబాబు, అనుష్ కురివిళ్ల, సత్యం రాజేశ్ కీలకపాత్రలు పోషించారు.
మ్యాడ్ స్క్వేర్ చిత్రంలోని పాటలకు భీమ్స్ సెసిరోలియో ట్యూన్స్ ఇవ్వగా.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అందించారు తమన్. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశాయి. హారిక, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉండగా.. నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు.
లడ్డూ పెళ్లి క్యాన్సిల్ అవడం, ఆ తర్వాత మ్యాడ్ గ్యాంగ్ గోవాకు వెళ్లి రచ్చచేయడం చుట్టూ మ్యాడ్ స్క్వేర్ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, కామెడీ మెరుగ్గా ఉండటం ప్రేక్షకులను మెప్పిస్తోంది. నితిన్ హీరోగా నటించిన రాబిన్‍హుడ్ పోటీలో ఉన్నా ఎక్కువగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అందులోనూ సీక్వెల్ కావడంతో మంచి బజ్ ఉండడం మ్యాడ్ స్క్వేర్ మూవీకి కలిసి వచ్చింది. మొత్తంగా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది.
సంబంధిత కథనం
టాపిక్