




Best Web Hosting Provider In India 2024

AP Gurukulam Admissions : ఏపీ గురుకుల స్కూల్స్, కాలేజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు- ఏప్రిల్ 6 వరకు అవకాశం
AP Gurukulam Admissions : ఏపీలోని గురుకుల పాఠశాలలు, ఆర్జేసీ, ఆర్డీసీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. విద్యార్థులు ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రవేశాల దరఖాస్తులను ఏప్రిల్ 9 వరకు పొడిగించారు.

AP Gurukulam Admissions : ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించారు. గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి అడ్మిషన్లు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీల్లో ప్రవేశాలకు గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. జూనియర్, డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వరకు పొడిగించారు.
ఏపీ గురుకుల పాఠశాలలు, ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ దరఖాస్తు కోసం ఈ లింక్ https://aprs.apcfss.in/ పై క్లిక్ చేయండి.
ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల అడ్మిషన్లు
ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల 5వ తరగతి ప్రవేశాలు, 6, 7, 8 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 9వ వరకు పొడిగించారు. పరీక్ష తేదీని ఏప్రిల్ 20వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 14 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్ ప్రవేశాలకు ఈ లింక్ https://twreiscet.apcfss.in/ పై క్లిక్ చేయండి.
ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో 5వ తరగతి ప్రవేశానికి, 6,7,8,9 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 6న నిర్వహించనున్నట్లు ముందుగా ప్రకటించినప్పటికీ ఏపీ గిరిజన గురుకుల సొసైటీ గురుకులం, తాడేపల్లి వారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 20 తేదీకి మార్పు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ప్రవేశాల కోసం ఆన్లైన్లో ఏప్రిల్ 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టీటీసీ సమ్మర్ ట్రైనింగ్
టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ (టీటీసీ) వేసవి ట్రైనింగ్ కోర్సులకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలో మే 1 నుంచి జూన్ 11 వరకు శిక్షణ ఉంటుంది. ఈ ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 2025 మే 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 45 ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులు.
సాంకేతిక అర్హతలు..
సాంకేతిక అర్హతలకు సంబంధించి టెక్నికల్, లోయర్ గ్రేడ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, ఐటీఐలో జారీ చేసిన నేషనల్ ట్రేడ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ సర్టిఫికేట్లు, తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన కర్నాటక సంగీతంలో గాత్రం సర్టిఫికేట్లులో ఏదో ఒకటి కలిగి ఉండాలి.
దరఖాస్తు ఇలా
దరఖాస్తును ఏప్రిల్ 3 నుంచి 25 వరకు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/TCC_Links.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను, అప్లికేషన్‌తో పాటు అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయంలో మే 1వ తేదీన హాజరుకావాల్సి ఉంటుంది.
టాపిక్