





Best Web Hosting Provider In India 2024

Tasty Egg Gravy: తమిళనాడు స్టైల్లో ఎగ్ గ్రేవీ తయారుచేయండిలా.. సింపుల్ రెసిపీతో సూపర్ వంటకం రెడీ చేయండి
Tasty Egg Gravy: తమిళనాడు స్టైల్లో ఎగ్ గ్రేవీ ఎప్పుడైనా ట్రై చేశారా? కాస్త కొత్తగా, రుచికరంగా ఎగ్ కర్రీని ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్. పోషకాలు పుష్కలంగా ఉండే గుడ్డు కర్రీ తినడానికి రెడీ అయిపోండి. ఈ సింపుల్ రెసిపీతో ప్రొసీడ్ అయిపోండి.

డైలీ ఎక్సర్‌సైజ్ చేసే వాళ్లకి, బరువు పెరగాలనుకునేవారికి ఎగ్ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేసే గుడ్లు ఉడకబెట్టుకుని తినడంలోనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందట. అలాంటప్పుడు కర్రీ చేసుకుని తింటే బాగుంటుంది కదా. మీరిప్పటికే చాలా రకాలుగా ఎగ్ కర్రీ వండుకుని ఉంటారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడు స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చూసేయండి. టేస్టీ వంటకాన్ని రెడీ చేసుకునేందుకు ఈ రెసిపీ ఫాలో అయిపోండి.
వంట చేయడం రాని వారు కూడా గుడ్లతో చాలా ఈజీగా వంట రెడీ చేసుకోవచ్చు. కాస్త మార్పులు చేస్తే, చికెన్ గ్రేవీ మాదిరిగా కాకుండా ఎగ్ కర్రీ కొత్తగా, రుచికరంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందామా.. చపాతీల్లోకి, భోజనంలోకి ఇలా దేనితోనైనా సైడ్ డిష్‌గా తినగలిగే ఎగ్ గ్రేవీని తయారుచేయడానికి ఈ సింపుల్ రెసిపీ ఫాలో అవండి.
కావల్సిన పదార్థాలు:
గుడ్లు – 4
ఉల్లిపాయలు – 2
అల్లం – 1 టీ స్పూన్
బెల్లం – 1/2 టీ స్పూన్
వెల్లుల్లి పేస్ట్ – 1/2 టీ స్పూన్
పసుపు – 1/4 టీ స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నీళ్లు – గ్రేవీ అవసరాన్ని బట్టి,
ఆవాలు – అర టీ స్పూన్,
నూనె – 2 టేబుల్ స్పూన్లు.
గుడ్డు గ్రేవీ ఎలా తయారు చేయాలి?
- ముందుగా ఒక గిన్నెలో గుడ్లు ఉంచి, అవి మునిగేంత వరకూ నీళ్లు పోయండి. ఆ గిన్నెను స్టవ్ మీద ఉంచి గుడ్లను ఉడకబెట్టుకోండి.
- ఉడికిన గుడ్లను పక్కకు పెట్టుకుని చల్లారనివ్వండి.
- మరోవైపు ఉల్లిపాయను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
- వాటితో పాటుగా టమోటాలను కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి విడిగా పేస్ట్‌లా చేసుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడిచేయండి.
- అందులో ఆవాలు వేసి వేయించుకోండి.
- ఆ తర్వాత లవంగాలు, కరివేపాకు వేసి వేయించండి.
- అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం – వెల్లుల్లి పేస్టు వేసి 4 నుంచి 5 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు టొమాటో పేస్ట్ వేసి మిశ్రమంతో పాటు కలిసేలా అటూ ఇటూ తిప్పుతూ మరో 5 నిముషాల పాటు వేయించాలి.
- అలా టొమాటో పేస్ట్ ఆకుపచ్చ రంగులోకి మారేంత వరకూ వేయించుకోండి.
- ఇప్పుడు అందులో ధనియాల పొడి, పసుపు, కారం, బెల్లం వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి మళ్లీ కలపాలి.
- ఒక రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి మిశ్రమాన్ని మరిగించాలి. ఈ మిశ్రమం బాగా మరిగిస్తే గ్రేవీ చిక్కగా మారుతుంది.
- ఆ విధంగా మారిన మిశ్రమంలో ఉడికించిన గుడ్లను రెండు భాగాలుగా కట్ చేసి కలపాలి. అంతే, రుచికరమైన గుడ్డు కూర రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీని చపాతీల్లోకి, అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు.
గుడ్లలో విటమిన్లు A, D, E, B12, ఫోలేట్, ఐరన్, భాస్వరం, సెలీనియం వంటి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
సంబంధిత కథనం