




Best Web Hosting Provider In India 2024

OTT Action Thriller: ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్‍కు షాహిద్, పూజా హెగ్డే చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Deva OTT Streaming: దేవా చిత్రం ఓటీటీ ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ మూవీ ఓటీటీలో ప్రస్తుతం మంచి వ్యూస్ సాధిస్తోంది. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది.

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన దేవా మూవీ మంచి బజ్‍తో వచ్చింది. జనవరి 31వ తేదీన ఈ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత జోరు చూపలేకపోయింది. కమర్షియల్‍గా ఈ సినిమా చతికిలపడింది. రీసెంట్‍గానే ఓటీటీలోకి వచ్చిన దేవా ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది.
ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండింగ్
దేవా చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. సినిమాల విభాగంలో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా రెండో రోజుల కిందట ఫిబ్రవరి 28న ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ స్ట్రీమ్ అవుతోంది. రెండు రోజుల్లోనే నెట్‍ఫ్లిక్స్ సినిమా ట్రెండింగ్‍లో దేవా ఫస్ట్ ప్లస్‍కు వచ్చింది.
స్ట్రీమింగ్ తర్వాత కూడా మిక్స్డ్ రెస్పాన్స్
దేవా చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ మూవీకి స్ట్రీమింగ్ తర్వాత కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నరేషన్, స్టోరీ ఆకట్టుకునేలా లేదంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు. కథనం ఇంట్రెస్టింగ్‍గా లేదని కొందరు అంటున్నారు. అయితే, షాహిద్ కపూర్ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రంలో షాహిద్ యాక్టింగ్, స్వాగ్ అదిరిపోయాయంటూ కొందరు రాసుకొస్తున్నారు.
రీమేక్‍గా..
2013లో వచ్చిన మలయాళ మూవీ ముంబై పోలీస్‍కు రీమేక్‍గా దేవా చిత్రం తెరకెక్కింది. రోషన్ ఆండ్రూస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, క్లైమాక్స్ విషయంలో మార్పులు చేశారు. దేవా చిత్రంలో ఏసీపీ దేవ్ ఆంబ్రే పాత్రను షాహిద్ పోషించారు. జర్నలిస్ట్ దివ్య క్యారెక్టర్ చేశారు పూజా హెగ్డే. పావలి గులాటీ, పర్వేశ్ రాణా, కుబ్రా సైత్, గిరీశ్ కులకర్ణి, మనీష్ వాద్వా, గౌరవ్ మోర్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
బాక్సాఫీస్ డిజాస్టర్
దేవా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ సుమారు రూ.80కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. ఈ చిత్రం దాదాపు రూ.50కోట్ల కలెక్షన్లనే దక్కించుకుంది. దీంతో కమర్షియల్‍గా ప్లాఫ్ అయింది. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ పతాకాలపై సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేశ్ భన్సాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. జేక్స్ బెజోయ్, విశాల్ మిశ్రా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు. ఈ చిత్రంలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
దేవా స్టోరీలైన్
ముంబైలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా దేవ్ (షాహిద్ కపూర్) ఉంటాడు. గ్యాంగ్‍స్టర్ ప్రభాత్ జాదవ్ (మనీశ్ వాద్వా)ను దేవ్ ఎన్‍కౌంటర్ చేస్తాడు. అయితే, ఆ ఎన్‍కౌంటర్ క్రెడిట్‍ను ఏసీపీ రోషన్ డిసిల్వ (పవైల్) తీసుకుంటాడు. అయితే, రోహన్ హత్యకు గురవుతాడు. ఆ హత్య కేసును దేవ్ ఛేదిస్తాడు. హత్య ఎవరు చేశారో కనుగొంటాడు. అయితే, అప్పుడు జరిగే ఓ యాక్సిడెంట్‍లో దేవా మెమొరీ లాస్ అయి అంతా మర్చిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ దేవా చిత్రంలో ఉంటుంది.
సంబంధిత కథనం