






Best Web Hosting Provider In India 2024

Guntur Inhuman Incident : గుంటూరులో దారుణం, మొదటి భార్య సంతానానికి చిత్రహింసలు-గొంతు నులిమి ఆరేళ్ల చిన్నారి హత్య
Guntur Inhuman Incident : గుంటూరులో అమానవీయ సంఘటన జరిగింది. మొదటి భార్య కుమారులను రెండో భార్య అతికిరాతకంగా చిత్రహింసలు పెట్టింది. ఆరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హత్యచేసింది. మరో కుమారుడిని వేడి అట్లపెనంపై కూర్చొబెట్టింది.

Guntur Inhuman Incident : గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు ఫిరంగిపురంలో మొదటి భార్య సంతానమైన ఇద్దరి చిన్నారుల పట్ల రెండో భార్య అతి కిరాతకంగా వ్యవహరించింది. ఆరేళ్ల చిన్న కుమారుడిని చిత్ర హింసలు పెట్టి హత్య చేసింది. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్‌కు గతంలో వివాహం అయ్యింది. ఆయనకు మొదటి భార్యతో కవల పిల్లలు పుట్టారు. రెండేళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో…సాగర్ ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే 8 నెలల క్రితం లక్ష్మి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి భార్య ఇద్దరు కుమారులను లక్ష్మి నిత్యం చిత్రహింసలకు గురిచేసేది.
అట్లపెనంపై కూర్చోబెట్టి
అతికిరాతంగా బెల్టు, కర్రతో కొట్టేది. తాజాగా చిన్న కుమారుడు కార్తిక్ తలపై కర్రతో బలంగా కొట్టింది. ఆ తర్వాత గొంతు నులిమి ఆరేళ్ల చిన్నారిని చంపేసింది. పెద్దకుమారుడు ఆకాశ్‌ను పొయ్యిపై కాలుతున్న అట్లపెనంపై కూర్చోబెట్టి కాల్చింది. అయితే మొదటి భార్య పిల్లలను రెండో భార్య పెట్టిన చిత్రహింసలకు సాగర్ కూడా సహకరించినట్లు తెలుస్తోంది. అయితే పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుసుకున్న గోశాల విజయ అనే మహిళ…పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత కథనం
టాపిక్