






Best Web Hosting Provider In India 2024

OTT Telugu Web Series: జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఓటీటీలో మరో తెలుగు వెబ్ సిరీస్
OTT Telugu Web Series: స్కూల్ రోజులను గుర్తు చేసేలా ఓటీటీలోకి ఓ తెలుగు వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్ ఫస్ట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. నలుగురు స్నేహితుల మధ్య ఈ సిరీస్ సాగనుంది.

ఈటీవీ విన్ ఓటీటీలో గతేడాది ‘90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. 1990ల నాటి మధ్యతరగతి కుటుంబ పరిస్థితులను చూపించిన ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పించింది. అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చి.. చాలా మందికి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇదే పంథాలో మరో తెలుగు వెబ్ సిరీస్ రానుంది. అయితే, స్కూల్ రోజులను గుర్తు చేసేలా ఈ నయా సిరీస్ ఉండనుంది. ఈ సిరీస్‍పై నేడు అనౌన్స్‌మెంట్ వచ్చింది.
నలుగురు స్నేహితులతో..
ఈటీవీ విన్ ఓటీటీ నేడు (మార్చి 30) ఉగాది రోజున కొత్త వెబ్ సిరీస్‍ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ తీసుకొచ్చింది. 1997 – 2007 మధ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన ఆనంద్, గణేశ్, శ్రీకాంత్, సంతోష్ అనే నలుగురు అబ్బాయిల చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది. ఆ స్నేహితులు ఇప్పుడు పెద్దయ్యాక మళ్లీ ఆ పాఠశాలకు వచ్చి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఈ సిరీస్‍లో ఉండనుందని పోస్టర్ ద్వారా అర్థమవుతోంది.
పాఠశాల ముందు ఉన్న గోడపై నలుగురు పిల్లలు కూర్చొని ఉండగా.. పెద్దయ్యాక వారిని వారే గుర్తు చేసుకుంటున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఏఐ స్టూడియో ఘిబ్లీ స్టైల్‍లో ఈ పోస్టర్ తీసుకొచ్చింది ఈటీవీ విన్. “నలుగురు స్నేహితులు. ఒక రీయూనియన్. ఎక్కడ ప్రయాణం మొదలైందో మళ్లీ అక్కడికే. పాతరోడ్లు, అంతం లేని నవ్వులు, జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునేందుకు ఎదురుచూస్తున్నాయి” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకా ఈ వెబ్ సిరీస్ టైటిల్‍ను వెల్లడించలేదు.
నిర్మాతగా అల్లు అర్జున్ టీమ్ హెడ్
ఈ వెబ్ సిరీస్‍ను శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు చెందిన కంటెంట్, డిజిటల్ టీమ్‍కు హెడ్‍గా శరత్ ఉన్నారు. ఈ సిరీస్‍తోనే ఆయన నిర్మాతగా మారుతున్నారు. దీంతో ప్రొడక్షన్ నంబర్ 1 అంటూ పోస్టర్ వచ్చింది. టైటిల్‍ను త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంది.
ఈ సిరీస్‍కు వినోద్ గాలి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది ఈటీవీ విన్‍లో వచ్చిన శశిమథనం చిత్రంతో వినోద్‍కు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈటీవీ విన్ సిరీస్‍ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నటీనటుల గురించి త్వరలో వెల్లడి కానుంది. ఇప్పటికైతే ఫస్ట్ పోస్టర్‌తోనే ఈ సిరీస్ ఇంట్రెస్ట్ పెంచింది. మరి ఈ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందో.. 90s రేంజ్‍లో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.
ఇటీవలే ‘గాంధీతాత చెట్టు’
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్ర పోషించిన గాంధీతాత చెట్టు చిత్రం ఇటీవలే ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. పద్మావతి మల్లడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరిలో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఈటీవీ విన్‍లోకి వచ్చింది. 2000ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది. పొలంలో తన తాత ఎంతో ప్రేమగా పెంచుకున్న చెట్టును కాపాడుకునేందుకు ఓ అమ్మాయి ఎలాంటి ప్రయత్నాలు చేసిందనే అంశం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రం ఎమోషనల్‍గా సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా ఉంది.
సంబంధిత కథనం