





Best Web Hosting Provider In India 2024

Peddi Glimpse Video Date: రామ్‍చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగ రోజున..
Peddi Glimpse Video Date: పెద్ది చిత్రం నుంచి అదిరిపోయే అప్‍డేట్ వచ్చేసింది. ఈ మూవీ గ్లింప్స్ వీడియో విడుదలకు డేట్ ఖరారైంది. అధికారికంగా తేదీని వెల్లడించింది మూవీ టీమ్.

రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై ప్లాప్‍గా నిలిచింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ నిరాశచెందారు. అయితే, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో రామ్‍చరణ్ చేస్తున్న చిత్రంపై అంచనాలు మాత్రం అత్యంత భారీగా ఉన్నాయి. ఇటీవలే వచ్చిన ఫస్ట్ లుక్‍తో హైప్ మరింత ఎక్కువైంది. ఇదే జోష్‍లో ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్‍డేట్ వచ్చింది. పెద్ది గ్లింప్స్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది.
గ్లింప్స్ డేట్ ఇదే
పెద్ది సినిమా గ్లింప్స్ వీడియో ఏప్రిల్ 6వ తేదీన రానుంది. శ్రీరామనవమి పండుగైన ఆ రోజు గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. పెద్ది ఫస్ట్ షాట్ పేరుతో ఏప్రిల్ 6న గ్లింప్స్ విడుదల కానుంది. ఉగాది సందర్భంగా నేడు (మార్చి 30) పెద్ది గ్లింప్స్ గురించి ఈ అప్‍డేట్ వెల్లడించింది మూవీ టీమ్.
పెద్ది గ్లింప్స్ డేట్ ప్రకటన కోసం ఓ పోస్టర్ తీసుకొచ్చింది టీమ్. రామ్‍చరణ్ గాల్లోకి ఎగిరి ఏదో ఆటకు బరిలోకి దిగుతున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. చుట్టూ జెండాలు పట్టుకొని జనాలు కేరింతలు కొడుతుంటగా.. చెర్రీ గాల్లోకి ఎగిరారు. ఈ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
గ్లింప్స్‌పై ఫుల్ బజ్
పెద్ది చిత్రం నుంచి ఇటీవలే రామ్‍చరణ్ ఫస్ట్ లుక్ వచ్చింది. టైటిల్ రివీల్ అయింది. రస్టిక్‍గా చెర్రీ మాస్ లుక్ అదిరిపోయింది. లాంగ్ హెయిర్, గుబరు గడ్డం, ముక్కుపోగుతో ఉన్న చరణ్ లుక్ హైప్ పెంచేసింది. ఈ మూవీ గ్లింప్స్ గురించి కొన్నాళ్లుగా బజ్ నడుస్తోంది. ఈ గ్లింప్స్ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. గ్లింప్స్ చివర్లో వచ్చే షాట్ కోసం ప్రేక్షకులు పదేపదే చూస్తారంటూ హైప్ పెంచేశారు. ఈ గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూసున్నారు ఆడియన్స్. ఎట్టకేలకు ఏప్రిల్ 6న గ్లింప్స్ వీడియో వచ్చేయనుంది.
స్పోర్ట్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామా మూవీగా పెద్ది ఉండనుందని సమాచారం. గ్లింప్స్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి బలమైన స్క్రిప్ట్ తయారు చేసినట్టు టాక్. రంగస్థలం రేంజ్‍లో రస్టిక్‍గా ఈ చిత్రం చరణ్ కనిపించనున్నారు. పర్ఫార్మెన్స్‌కు చాలా స్కోప్ ఉండే పాత్ర అతడికి దక్కిందని తెలుస్తోంది.
పెద్ది చిత్రంలో రామ్‍చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలు పెద్ది చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
సంబంధిత కథనం