




Best Web Hosting Provider In India 2024
Eid Ul Fitr 2025 : సౌదీలో నెలవంక దర్శనం, ఈద్ పై ప్రకటన-భారత్ లో ఎప్పుడంటే?
Eid Ul Fitr 2025 : పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో..ఈద్ పై ప్రకటన వెలువడింది. సాధారంగా సౌదీ ప్రకటించిన తర్వాతి రోజు భారత్ లో చంద్రవంక దర్శనంతో ఈద్ జరుపుకుంటారు. అయితే భారత్ లో ఇంకా నెలవంక దర్శనం కాలేదు.

Eid Ul Fitr 2025 : ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. శనివారం సాయంత్రం సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. దీంతో మార్చి 30 ఆదివారం ఈద్-ఉల్-ఫితర్‌ను జరుపుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా సౌదీ అరేబియా రంజాన్ ప్రకటించిన తర్వాత రోజు భారతదేశంలో ఈద్ జరుపుకుంటారు. అందువల్ల భారత్ మార్చి 31, సోమవారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకునే అవకాశం ఉంది.
ఈత్ ఉల్ ఫితర్ ను “ఉపవాసం విరమించే పండుగ” అని పిలుస్తారు. ఇది రంజాన్ ముగింపును సూచిస్తుంది. ఈ సమయంలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఈద్ ఉల్-ఫితర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటైన రంజాన్…ఈ ఏడాది మార్చి 2, ఆదివారం నాడు భారత్ లో ప్రారంభమైంది, మార్చి 1న నెలవంక కనిపించిన తర్వాత రంజాన్ నెల ప్రారంభమైనట్లు ప్రకటించారు. సౌదీ అరేబియాలో పవిత్ర రంజాన్ మాసం మార్చి 1న ఒక రోజు ముందుగానే ప్రారంభమైంది.
భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ చంద్రుని దర్శనం ఎప్పుడు?
ఈద్-ఉల్-ఫితర్ తేదీ భారత్ లో చంద్రుడి దర్శనంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 30న నెలవంక కనిపిస్తే దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ ముగింపును గుర్తుచేసుకుని మార్చి 31 సోమవారం ఈద్ జరుపుకుంటారు. హిజ్రీ లేదా ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌ను ఆచారం ప్రకారం దీనిని అనుసరిస్తారు. నెల వంక కనిపించిన తర్వాతే ఈద్-ఉల్-ఫితర్ తేదీపై క్లారిటీ వస్తుంది. మార్చి 30న చంద్రుడు కనిపించకపోతే ఏప్రిల్ 1న పండుగ జరుపుకునే అవకాశం ఉంది.
సౌదీ ప్రకటించిన తర్వాతి రోజు భారత్ లో
ఈద్ నెలవంక సాధారణంగా సౌదీ అరేబియా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, కొన్ని పాశ్చాత్య దేశాలతో పాటు ముందుగా కనిపిస్తుంది. సౌదీ అరేబియాలో ఇవాళ రంజాన్ నిర్వహించుకున్నారు. మనదేశంలో ఇవాళ నెలవంక కనిపిస్తే…మార్చి 31న రంజాన్ నిర్వహించనున్నారు.
గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో తొలిసారిగా నెలవంక కనిపించింది. దీంతో ఆదివారం ఈద్ వేడుకలు ప్రారంభమయ్యాయి . భారతదేశం , పాకిస్తాన్, ఇతర పొరుగు దేశాల కంటే సౌదీ అరేబియా ఈద్ ను ఒక రోజు ముందుగా పాటిస్తుంది. అందువల్ల, భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ మార్చి 31, సోమవారం నాడు జరుపుకునే అవకాశం ఉంది.
నెలవంక కనిపిస్తేనే ఈద్
అరుదైన పరిస్థితుల కారణంగా నెలవంక కనిపించకపోతే ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ లేదా హిజ్రీ ఆచారాల ప్రకారం, ఈద్ జరుపుకోలేరు. నెలవంక కనిపించిన తర్వాతే ఈద్-ఉల్-ఫితర్ నిర్వహణపై అధికారికంగా ధృవీకరణ వస్తుంది. భారత్ లో ఈద్ తేదీపై ..ఢిల్లీలోని జామా మసీదు, లక్నో మసీదు ఇమామ్‌లు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో చంద్రుడు కనిపించిన తర్వాత ఆదివారం ఈద్ గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.
సౌదీ అరేబియా నుంచి చంద్ర దర్శన ప్రకటనలు రావడంతో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సౌదీని అనుసరిస్తాయి. ఈ దేశాల్లో నేడు ఈద్ జరుపుకునే అవకాశం ఉంది.
Best Web Hosting Provider In India 2024
Source link