






Best Web Hosting Provider In India 2024

Chhaava OTT Release: ఓటీటీలోకి రూ.780కోట్ల ఛావా చిత్రం.. ఆరోజే రానుందా!
Chhaava OTT Release: ఛావా సినిమా స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో అంచనాలు వెలువడ్డాయి. డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇవే..

ఛావా చిత్రం సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ సాధించింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ సక్సెస్ అయింది. ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితంగా ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైంది. భారీ కలెక్షన్లను సాధించింది. మార్చిలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లను దక్కించుకుంది. ఛావా సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఆరోజే స్ట్రీమింగ్‍కు!
ఛావా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ వద్ద ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వస్తుందని తాజాగా అంచనాలు బయటికి వచ్చాయి. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా చావా మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఏప్రిల్ 11న ఈ ఛావా చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుందని సమాచారం.
ఛావా సినిమా ఏప్రిల్ 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆరోజే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందా.. నెట్‍ఫ్లిక్స్ ఎప్పుడు డేట్‍ను వెల్లడిస్తుందో చూడాలి.
ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. మరాఠా యోధుడు ఛత్రవతి శివాజీ మహరాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. యాక్షన్, ఎమోషన్‍లను బాగా చూపించి ప్రేక్షకులను మెప్పించేలా ఈ చారిత్రాత్మక మూవీని డైరెక్టర్ రూపొందీంచారు. సంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ జీవించేశారు. అతడిపై భారీగా ప్రశంసలు వచ్చాయి.
ఛావా కలెక్షన్లు
ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి ఇప్పటి వరకు సుమారు రూ.780కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇంకా కాస్త థియేట్రికల్ రన్ సాగుతోంది. సుమారు రూ.140కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ ఆస్థాయి భారీ వసూళ్లతో దుమ్మురేపింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో కలెక్షన్లలో జోరు చూపించింది.
ఛావా మూవీలో సంభాజీ మహరాజ్‍గా విక్కీ నటించగా.. ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్నా మెప్పించారు. అక్షయ్ ఖన్నా, అషుతోశ్ రాణా, డయానా పెంటీ, నీల్ భూపాలమ్, దివ్య దత్తా, వరుణ్ బుద్ధదేవ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం