భార్యను చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కిన బెంగళూరు టెక్కీకి 14 రోజుల రిమాండ్

Best Web Hosting Provider In India 2024


భార్యను చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కిన బెంగళూరు టెక్కీకి 14 రోజుల రిమాండ్

HT Telugu Desk HT Telugu
Published Mar 31, 2025 08:44 AM IST

భార్యను చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి తీసుకెళ్లిన బెంగళూరు టెక్కీకి 14 రోజుల రిమాండ్ విధించారు.

భార్యను హతమార్చిన టెక్కీని అదుపులోకి తీసుకున్న పోలీసులు (ప్రతీకాత్మక చిత్రం)
భార్యను హతమార్చిన టెక్కీని అదుపులోకి తీసుకున్న పోలీసులు (ప్రతీకాత్మక చిత్రం)

భార్యను అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేస్‌లో కుక్కిన వ్యక్తిని శనివారం రాత్రి మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. నిందితుడు రాకేశ్ రాజేంద్ర ఖేడేకర్ (36)ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

రాకేష్ తన భార్య గౌరీ అనిల్ సంబ్రేకర్ (32)ను మార్చి 26 రాత్రి హులిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లిలోని అద్దె ఇంట్లో హత్య చేశాడు. అనంతరం నిందితుడు మహారాష్ట్రకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. 

భార్య మృతదేహాన్ని సూట్‌కేసులో తరలించేందుకు ప్రయత్నించాడని, అయితే హ్యాండిల్ పగిలిపోవడంతో ఆ ప్లాన్ రద్దు చేసుకున్నాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తరువాత ఇంటికి తాళం వేసి కారులో పుణె వైపు వెళ్లాడు.

మార్చి 27న మహారాష్ట్రలోని షిర్వాల్ లో ఉన్నప్పుడు రాకేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. కొద్ది మొత్తంలో ఫినాయిల్, బొద్దింకల మందు తాగాడు. ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యే వరకు వైద్య సంరక్షణలోనే ఉన్నాడు

ఆసుపత్రిలో మోహరించిన హులిమావు పోలీస్ స్టేషన్ బృందం రాకేష్‌‌ను అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని బెంగళూరుకు తరలించారు. అప్పటి నుంచి రాకేష్‌ను పరప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో ఉంచారు. మంగళవారం ఆయనను పోలీసు కస్టడీకి కోరనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

దర్యాప్తులో తేలిన విషయాలు

గౌరీ ఆధిపత్యం చేయడం వల్లే తాను ఆమెను హత్య చేశానని, తరచూ తనతో గొడవ పడేదని రాకేష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె మొదట తనపై కత్తితో దాడి చేసిందని చెప్పినట్టు సమాచారం. అయితే, ఈ ఘటనలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సూట్‌కేసులో ఉంచినప్పుడు గౌరీ సజీవంగా ఉండి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేరం గురించి మొదట సమాచారం ఇచ్చిన రాకేష్ తండ్రి రాజేంద్ర ఖేడేకర్ పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

HT Telugu Desk

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link