


Best Web Hosting Provider In India 2024
AP Anganwadi Jobs : అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
AP Anganwadi Jobs : అల్లూరు సీతారామరాజు జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలుకు ఏప్రిల్ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. పోస్టులు, అర్హతలు, వయో పరిమితి, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి వారి కార్యాలయం నుండి.. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న114 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులు..
మొత్తం 114 పోస్టులు ఉన్నాయి. అందులో 7 అంగన్‌వాడీ వర్కర్, 56 అంగన్‌వాడీ హెల్పర్, 27 మినీ అంగన్‌వాడీ వర్కర్, పీఎం జనమన్ పథకంలో కొత్తగా మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాలలో 24 అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మహిళ అర్హులు. కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయొచ్చు.
అర్హతలు.. వయో పరిమితి..
అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగాలకు పదో తరగతి పూర్తి చేయడం తప్పని సరి. అంగన్‌వాడీ సహాయకురాలు ఉద్యోగాలకు ఏడో తరగతి అర్హత ఉన్న వారు అర్హులు. కనీస వయస్సు 2025 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోతే.. 18 సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
జీతం..
అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.11,500, అంగన్‌వాడీ సహాయకులకు రూ.7,000 నెల జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి పరీక్ష లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అర్హత గత వారు ఏప్రిల్ 10 తేదీ సాయింత్రం 5 గంటల లోపు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యా అర్హత, ఇతర సర్టిఫికేట్లు జెరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అప్లికేషన్ అందజేయాలి.
ఎంపిక..
ఈ పోస్టులకు అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటి ఎంపిక చేస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణత పొందినందుకు 50 మార్కులు, ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందితే 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, చిన్నపిల్లలు ఉన్న వితంతువులకు 5 మార్కులు, అనాథ అభ్యర్థికి 10 మార్కులు, దివ్యాంగ అభ్యర్థులకు 5 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు.. మొత్తం 100 మార్కులు ఉంటాయి.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..
1.పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
2.పదో తరగతి సర్టిఫికేట్
3.కుల ధువ్రీకరణ పత్రం
4.స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం
5.వివాహితురాలైతే వివాహ ధ్రువీకరణ పత్రం
6.అనుభవం ఉంటే, అనుభవ పత్రం
7.దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్
8.వితంతువులతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్