IPL 2025 Malaika Arora Sangakkara Dating: ఆ లెజెండరీ క్రికెటర్ తో మలైకా అరోరా డేటింగ్.. స్టాండ్స్ లో క్లోజ్.. నిజం ఏంటి?

Best Web Hosting Provider In India 2024

IPL 2025 Malaika Arora Sangakkara Dating: ఆ లెజెండరీ క్రికెటర్ తో మలైకా అరోరా డేటింగ్.. స్టాండ్స్ లో క్లోజ్.. నిజం ఏంటి?

Chandu Shanigarapu HT Telugu
Published Mar 31, 2025 05:10 PM IST

IPL 2025 Malaika Arora Sangakkara Dating: బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా.. లెజెండరీ క్రికెటర్ కుమార సంగక్కర తో డేటింగ్ చేస్తుందని ప్రచారం వైరల్ గా మారింది. ఐపీఎల్ లో సీఎస్కే, ఆర్ఆర్ మ్యాచ్ లో స్టాండ్స్ లో వీళ్లు క్లోజ్ గా కనిపించడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.

సంగక్కరతో మలైకా అరోరా
సంగక్కరతో మలైకా అరోరా

బాలీవుడ్ నటి మలైకా అరోరా, లెజండరీ క్రికెటర్ కుమార సంగక్కర మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. వీళ్లు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఐపీఎల్ 2025 లో ఆదివారం (మార్చి 30) రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్ లో మలైకా, సంగక్కర పక్కపక్కనే కూర్చోవడంతో రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి.

ఫొటో వైరల్

గౌహతిలోని బర్సపార క్రికెట్ స్టేడియంలో జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో సంగక్కర, మలైకా ఫొటో వైరల్ గా మారింది. మాజీ శ్రీలంక క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌ సంగక్కరతో కలిసి మలైకా మ్యచ్ ను ఎంజాయ్ చేస్తున్న సీన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సంగక్కర గతంలో రాజస్థాన్ రాయల్స్ కోచ్ గానూ పనిచేసిన సంగతి తెలిసిందే.

ఆ జెర్సీలో భామ

బాలీవుడ్ నటి, హాట్ భామ మలైకా అరోరా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో కనిపించడం కూడా ఈ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చుతోంది. నెటిజన్లు వెంటనే ఊహాగానాలు ప్రారంభించారు. కొందరు ఆమెకు జట్టుతో ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.

వైరల్ అయిన మలైకా, సంగక్కర వీడియో మరింత చర్చకు దారితీసింది. నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అంటున్నారు. “ఈ మలైకా అరోరా ఆర్ఆర్ డగ్అవుట్‌లో ఎందుకు కూర్చుంది?? అదీ సంగాతో కలిసి” అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. మరొకరు.. “మలైకా అరోరా.. కుమార సంగక్కరాతో కూర్చుంది. ఏదో జరుగుతోందా? ఆమెకు, ఆర్ఆర్ కు మధ్య ఎలాంటి సంబంధం కనిపించడం లేదు.” అని వ్యాఖ్యానించాడు.

నిజం లేదు

అయితే ఈ ఊహాగానాలలో నిజం లేదనిపిస్తోంది. ఈ బాలీవుడ్ నటి మలైకా అరోరా క్లోజ్ వర్గాలు ఈ రూమర్స్ ను కొట్టిపడేశాయి. “ఇద్దరు వ్యక్తులు ఒకరి పక్కన ఒకరు కూర్చుంటే వారు ప్రేమలో ఉన్నారని అర్థం కాదు. ప్రజలు అలాంటి నిరాధార కథలను కల్పించడం ఆపాలి” అని ఆ వర్గాలు ప్రకటించాయి.

గతంలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేసింది. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. కానీ గతేడాది అక్టోబర్ లో తాను సింగిల్ అని అర్జున్ కపూర్ అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. సింగం అగైన్ చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో అర్జున్ ఈ విషయం చెప్పాడు. “నేను ఇప్పుడు సింగిల్. రిలాక్స్ అవ్వండి” అని అర్జున్ పేర్కొన్నాడు.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024