






Best Web Hosting Provider In India 2024

AP SSC Exams : రేపు పదోతరగతి సోషల్ పరీక్ష యథాతథం, ఎలాంటి అపోహలు వద్దు- పాఠశాల విద్యాశాఖ
AP SSC Exams : ఏపీ పదో తరగతిలో భాగంగా రేపు సోషల్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.

AP SSC Exams : ఏపీ పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 1) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలపాలని కోరారు.
ఏపీలో రేపు ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పదోతరగతి పరీక్ష నిర్వహణపై అపోహలు వస్తున్నాయి. దీంతో పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
ఏపీలో మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. రంజాన్ సెలవు కారణంగా సోషల్ పరీక్ష తేదీని మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీకి పాఠాశాల విద్యాశాఖ మార్చిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీన ఈద్ అల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు. కాబట్టి సోషల్ స్టడీస్ పరీక్షను 01-04-2025 (మంగళవారం)న నిర్వహిస్తామని తెలిపారు.
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి మూల్యాంకనం
రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాల పర్యవేక్షణలో పదో పబ్లిక్ పరీక్షలు ఎలాంటి ఆటంకం జరగకుండా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పరీక్షలు ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఆన్సర్ పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఏడు రోజులపాటు మూల్యాంకనం చేయనున్నారు.
అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఆయా రోజుల్లో రోజుకు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేయనున్నారు. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలిస్తారు. మూల్యాంకనం పూర్తైన వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్ పరిశీలిస్తారు. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసిన ఆన్సర్ షీట్లలో కనీసం రెండు జవాబు పత్రాల చొప్పున పరిశీలించాల్సి ఉంటుంది. క్యాంప్ ఆఫీసర్ రోజుకు 20 ఆన్సర్ పత్రాలు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకు 45 ఆన్సర్ పత్రాల చొప్పున మూల్యాంకనం చేసిన పత్రాలు పునఃపరిశీలన చేస్తారు.
సంబంధిత కథనం
టాపిక్