






Best Web Hosting Provider In India 2024

Chhattisgarh Encounter : ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్, తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు మృతి
Chhattisgarh Encounter : ఛత్తీస్ గడ్ దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్తు ముఖ్యనాయకురాలు రేణుక అలియాస్ చైతు మృతి చెందారు. ఆమె స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామం. ఎల్ఎల్బీ చదివిన చైతు తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 35 ఏళ్ల క్రితం ఆమె మావోయిస్టు పార్టీలో చేరారు.

Chhattisgarh Encounter : ఛత్తీస్ గడ్ జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు ముఖ్య నాయకురాలు మృతి చెందారు. సోమవారం ఉదయం దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు మరణించారు. మృతురాలు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు నాయకురాలు చైతు ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామం, ఆమె 35 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు.
ఎల్ఎల్బీ చదివిన చైతు తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అలాగే మహిళా సంఘంలో పనిచేశారు. సీఎం చంద్రబాబు అలిపిరి దాడి అనంతరం రేణుక అలియాస్ చైతు మావోయిస్టు పార్టీలోకి పూర్తిస్థాయి కార్యకర్తగా మారాయి. రేణుక అలియాస్ చైతు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు సహచరిణిగా… విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ నంబర్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
రజాకార్లకు వణుకు పుట్టించిన గ్రామంలో
రేణుక తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒక సోదరుడు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మరొక సోదరుడు దేశ రాజధాని దిల్లీలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు సమాచారం. కడవెండి గ్రామం అంటేనే రజాకార్లకు గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం, విప్లవాల ఖల్లా గా పేరుంది. రేణుక మరణంతో కడవెండి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్