Miami Open Djokovic Mensik: జకోవిచ్ సెంచరీ మిస్.. షాక్ ఇచ్చిన 19 ఏళ్ల కుర్రాడు.. మెన్సిక్ దే మియామి ఓపెన్

Best Web Hosting Provider In India 2024


Miami Open Djokovic Mensik: జకోవిచ్ సెంచరీ మిస్.. షాక్ ఇచ్చిన 19 ఏళ్ల కుర్రాడు.. మెన్సిక్ దే మియామి ఓపెన్

Chandu Shanigarapu HT Telugu
Published Mar 31, 2025 04:17 PM IST

Miami Open Djokovic Mensik: టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ సెంచరీ ఆశ తీరలేదు. 100వ సింగిల్ టైటిల్ గెలిచిన మూడో ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేయాలనుకున్న అతనికి.. 19 ఏళ్ల కుర్రాడు మెన్సిక్ షాకిచ్చాడు.

మియామి ఓపెన్ ఫైనల్లో ఓడిన జకోవిచ్
మియామి ఓపెన్ ఫైనల్లో ఓడిన జకోవిచ్ (AP)

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కు షాక్. ఈ లెజెండ్ 100వ సింగిల్ టైటిల్ కు మళ్లీ అడుగు దూరంలో ఆగిపోయాడు. మియామి ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ కు భంగపాటు ఎదురైంది. ఈ టైటిల్ పోరులో 19 ఏళ్ల జాకబ్ మెన్సిక్.. జకోవిచ్ ను కంగు తినిపించాడు. ఇండియన్ టైమ్ ప్రకారం సోమవారం (మార్చి 31) జరిగిన ఈ పోరులో వరుస సెట్లలో మ్యాచ్ గెలిచిన మెన్సిక్ టైటిల్ ఎగరేసుకుపోయాడు.

హోరాహోరీగా

మియామి ఓపెన్ 1000 టోర్నీ ఫైనల్లో జకోవిచ్, మెన్సిక్ మధ్య ఫైనల్ హోరాహోరీగా సాగింది. 37 ఏళ్ల జకోవిచ్.. 19 ఏళ్ల మెన్సిక్ కు గట్టిపోటీనిచ్చాడు. చివరకు మెన్సిక్ 7-6 (7-4), 7-6 (7-4) తేడాతో జకోవిచ్ పై విజయం సాధించాడు. రెండు సెట్లూ ఉత్కంఠభరితంగా ఒకేలా సాగాయి. రెండు సెట్లలోనూ టైబ్రేకర్ లోనే ఫలితం తేలింది. చివరకు టైబ్రేకర్ లో జకోవిచ్ తలవంచాల్సి వచ్చింది.

ఇద్దరు మాత్రమే

ఓపెన్ శకంలో ఇద్దరు పురుష ప్లేయర్స్ మాత్రమే 100, అంతకంటే ఎక్కువ సింగిల్స్ టైటిళ్లు గెలిచారు. జిమ్మీ కానర్స్ (109), రోజర్ ఫెదరర్ (103) మాత్రమే ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పటికే 99 టైటిళ్లు గెలిచిన జకోవిచ్.. మియామి ఓపెన్ ట్రోఫీతో ఆ ఇద్దరి సరసన చేరాలని అనుకున్నాడు. కానీ మెన్సిక్.. జకోవిచ్ కు బ్రేక్ వేశాడు.

వాచిన కన్నుతో

ఈ ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ వాచిన కన్నుతోనే ఆడాడు. వర్షం కారణంగా ఆరు గంటల ఆలస్యంగా ఈ మ్యాచ్ మొదలైంది. కోర్టులోకి వచ్చిన జకోవిచ్ కుడి కంటి చుట్టూ వాపు కనిపించింది. మ్యాచ్‌ను నెమ్మదిగా ప్రారంభించిన జకో తన మొదటి సర్వీస్ గేమ్‌ను కోల్పోయాడు.

మొదటి సెట్‌లో మార్పు సమయంలో జకో కొన్ని కంటి చుక్కలను వేసుకున్నాడు. కన్ను ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు కనిపించాడు. కానీ 24 గ్రాండ్ స్లామ్స్ విన్నరైన జకో ఈ కన్ను వాపు గురించి ఏం చెప్పలేదు.

“ఇది నాకు దురదృష్టకరం. రెండు టైబ్రేక్‌లు, చాలా వింతైన మ్యాచ్. వర్షం విరామంతో అన్ని విషయాలు వింతగానే జరిగాయి. నిజాయితీగా చెప్పాలంటే నేను కోర్టులో గొప్పగా ఆడలేదు. మెన్సిక్ విజయానికి అర్హుడు. కంటి సమస్య గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అని జకోవిచ్ చెప్పాడు.

ఫస్ట్ టైటిల్

చెక్ రిపబ్లిక్ కుర్రాడు మెన్సిక్ కు ఇదే ఫస్ట్ ఏటీపీ టైటిల్. ఇదే మొట్టమొదటి ఏటీపీ 1000 మాస్టర్స్ విజయం. ఓ మాస్టర్స్ టోర్నీలో ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరిన మెన్సిక్.. అదే జోరులో జకోవిచ్ ను ఓడించి టైటిల్ గెలిచాడు. ఈ విజయంతో తొలిసారి ర్యాంకింగ్స్ లో టాప్-25లో అడుగుపెట్టాడు. మరోవైపు మాస్టర్స్ 1000 టోర్నీ ఫైనల్ చేసిన ఓల్డెస్ట్ ప్లేయర్ గా నిలిచిన జకోవిచ్ కు చివరకు నిరాశ తప్పలేదు.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link