




Best Web Hosting Provider In India 2024

Aditya 369 Rerelease Trailer: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 రీరిలీజ్ ట్రైలర్ చూశారా?
Aditya 369 Rerelease Trailer: బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీ 4కే వెర్షన్ రీరిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను సోమవారం (మార్చి 31) రిలీజ్ చేశారు. ఎప్పుడో 34 ఏళ్ల కిందట వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతోంది.

Aditya 369 Rerelease Trailer: ఆదిత్య 369 మూవీ గుర్తుందా? ఇండియాలో తొలి టైమ్ ట్రావెల్ మూవీ ఇది. 1991లో రిలీజై సంచలన విజయం సాధించిన సైన్స్ ఫిక్షన్ మూవీ. ఆ కాలంలో ఇలాంటి సినిమా తెలుగులో రావడమే ఓ సంచలనం. ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది.
ఆదిత్య 369 రీరిలీజ్
ఒకప్పటి సినిమాలను ఇప్పటి 4కే వెర్షన్ లో థియేటర్లలో రీరిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మరోసారి ఆ కాలానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఎప్పుడో 34 ఏళ్ల కిందట అంటే 1991లో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఆదిత్య 369 మూవీ కూడా రీరిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్ లో బాలకృష్ణ నటించి సినిమా ఇది.
టైమ్ మెషీన్, కాలంలో వెనక్కి, ముందుకు వెళ్లడంలాంటి ఓ వినూత్నమైన కథతో రూపొందిన సినిమా ఇది. 34 ఏళ్ల కిందట ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఊహించడమే కష్టం. ఇండియాలో రూపొందించిన తొలి టైమ్ ట్రావెల్ సినిమాగా గుర్తింపు పొందింది. ఇప్పుడు 4కే వెర్షన్ లో రీరిలీజ్ కానుండటం ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఆదివారం (మార్చి 30) ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.
ఆదిత్య 369 ట్రైలర్ ఎలా ఉందంటే?
ఆదిత్య 369 మూవీ రీరిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. కాలంలో వెనక్కి అంటే ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి.. మళ్లీ కాలంలో ముందుకు అంటే 2504లోకి టైమ్ మెషీన్ లో ట్రావెల్ చేయడమే ఈ సినిమా ప్రత్యేకత. సింగీతం డైరెక్షన్, బాలయ్య బాబు నట, ఇళయరాజా మ్యూజిక్.. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
ఆదిత్య 369కు సీక్వెల్ ఆదిత్య 999ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో బాలకృష్ణతోపాటు అతని తనయుడు మోక్షజ్ఞ నటిస్తాడని కూడా చెప్పినా.. ఇప్పటి వరకూ ఈ సీక్వెల్ అడుగు ముందుకు పడలేదు. ఈ ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణతోపాటు మోహిని, అమ్రీష్ పురి, టిన్నూ ఆనంద్, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, సుత్తి వేలులాంటి వాళ్లు నటించారు.
ఆదిత్య 369 కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించినా.. అప్పటి బాలయ్య బాబు ఇతర సినిమాల కంటే ఎక్కువ వసూళ్లయితే రాబట్టలేకపోయింది. మరి ఇప్పుడు రీరిలీజ్ లో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
సంబంధిత కథనం