






Best Web Hosting Provider In India 2024

Chiranjeevi Nani: డ్రైవింగ్ ఫోర్స్‌గా నాని పనిచేశారు.. చిరంజీవి కామెంట్స్.. హీరో షర్ట్‌పై ఆటోగ్రాఫ్!
Chiranjeevi Praised Court Movie Nani And Gives Autograph: నాని సమర్పించిన కోర్ట్ మూవీని మెగాస్టార్ చిరంజీవి పొగడ్తలో ముంచెత్తారు. అలాగే, నేచురల్ స్టార్‌పై కామెంట్స్ చేశారు. ఇక కోర్ట్ మూవీలో హీరోగా చేసిన రోషన్ షర్ట్‌పై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. పూర్తి వివరాల్లోకి వెళితే..!

Chiranjeevi Praised Court Movie Nani And Gives Autograph: నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్
మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా కోర్ట్ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నటీనటులు, దర్శకుడిని ఇంటికి పిలిచి మరి సత్కరించారు.
ఎడ్యుకేటివ్ కోర్ట్ డ్రామా
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “కోర్ట్ అందరూ గర్వపడే సినిమా. కోర్ట్ సినిమా చూశాను. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. కథని ఆద్యంతం చాలా టైట్ చేసుకుంటూ వెళ్లారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర సహజంగా ఉంది. దీన్ని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్టు డ్రామాగా భావిస్తున్నాను” అని అన్నారు.
థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసే సినిమా
“సినిమాలో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్లడానికి డ్రైవింగ్ ఫోర్స్‌గా నాని పని చేశారని భావిస్తున్నాను. సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్‌లో చూడాలి. థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసే సినిమా ఇది” అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
రోషన్ వైట్ షర్ట్‌పై చిరు ఆటోగ్రాఫ్
అయితే, మెగాస్టార్ చిరంజీవి నుంచి కోర్ట్ మూవీ హర్ష్ రోషన్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అది కూడా తన షర్ట్‌పై. రోషన్ వైట్ షర్ట్‌పైన “రోషన్ రాక్” అని మెగాస్టార్ రాసుకొచ్చారు. అలాగే, చిరంజీవి అని రోషన్ వైట్ షర్ట్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోర్ట్ మూవీ టీమ్ సంతోషం
ఇక మెగాస్టార్ చిరంజీవి అభినందించడంపై కోర్ట్ యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. చిరంజీవి గారు అభినందించడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని సంతోషాన్ని వ్యక్తి చేసింది కోర్ట్ మూవీ టీమ్.
10 రోజుల్లో 50 కోట్ల గ్రాస్
ఇదిలా ఉంటే, కోర్ట్ సినిమా బాక్సాఫీసు వద్ద ఘనమైన విజయాన్ని సాధించింది. పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే యూఎస్‌లో వన్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసి సత్తా చాటింది. ప్రస్తుతం కోర్ట్ సినిమా అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్