






Best Web Hosting Provider In India 2024

OTT Movies: ఓటీటీలో 19 సినిమాలు- 12 చాలా స్పెషల్, 7 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
OTT Movies This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు 12 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటే, తెలుగులో ఏకంగా 7 తెలుగులో ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇందులో ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్లే ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ సినిమాలపై లుక్కేద్దాం.

OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు మొత్తంగా 19 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌కు సంబంధించినవే ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ మూవీస్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
జూరర్ 2 (తెలుగు డబ్బింగ్ అమెరికన్ లీగల్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 1
హైపర్ నైఫ్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 2
ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 3
టచ్ మీ నాట్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బ్లాక్ బ్యాగ్ (అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 1
అక్టోబర్ 8 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- ఏప్రిల్ 1
ది బాండ్స్‌మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
నిమేష్ పటేల్ ఇన్‌స్టంట్ కర్మ (ఇండియన్ అమెరికన్ స్టాండప్ షో)- ఏప్రిల్ 1
పల్స్ (అమెరికన్ మెడికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
టెస్ట్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 4
కర్మ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
గుణ గుణ ఇస్త్రీ ముడ (ఇంగ్లీష్ హారర్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 4
డిటెక్టివ్ కోనన్ (జపనీస్ డిటెక్టివ్ మాంగా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
404 (కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 4
ఇన్‌సైడ్ జాబ్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 6
జీ5 ఓటీటీ
కింగ్‌స్టన్ (తెలుగు, తమిళ హారర్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 4
ఆహా ఓటీటీ
హోమ్ టౌన్ (తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
సోనీ లివ్ ఓటీటీ
చమక్ సీజన్ 2 (హిందీ మ్యూజిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
అదృశ్యం సీజన్ 2 (హిందీ ఎస్పాయనేజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4
ఓటీటీలో 19
ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తం 19 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో నయనతార, సిద్ధార్థ్, మాధవన్ స్పోర్ట్స్ డ్రామా టెస్ట్, హారర్ ఫాంటసీ సినిమా కింగ్‌స్టన్, తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ టచ్ మీ నాట్, కామెడీ సిరీస్ హౌమ్ టౌన్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ తెలుగులో
అలాగే, తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ హైపర్ నైఫ్, కర్మ, లీగల్ డ్రామా చిత్రం జూరర్ 2, హారర్ థ్రిల్లర్ సిరీస్ ది బాండ్స్‌మ్యాన్, గుణ గుణ ఇస్త్రీ ముడ, 404, అదృశ్యం సీజన్ 2, బ్లాక్ బ్యాగ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా 19కి 6 సినిమాలు, 6 వెబ్ సిరీస్‌లతో 12 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే, వీటిలో ఏకంగా 7 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
సంబంధిత కథనం