




Best Web Hosting Provider In India 2024

Aha OTT Plan: ఆహా అనిపించే ఓటీటీ ప్లాన్- నెలకు 67 రూపాయలతో సబ్‌స్క్రిప్షన్- ఖర్చు తక్కువ కిక్కు ఎక్కువ- కానీ, ట్విస్ట్!
Aha OTT Plan 67 Per Month Details: ఆహా ఓటీటీ అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. ముబైల్ యూజర్స్‌కో ఎంతో ఉపయోగపడే ఈ ప్లాన్ అతి తక్కువ ఖర్చుతో రానుంది. కేవలం 67 రూపాయలతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది ఆహా ఓటీటీ. ఖర్చు తక్కువ కిక్కు ఎక్కువ ఇచ్చే ఈ ఆహా ఓటీటీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.

Aha OTT Plan 67 Per Month Details: దేశంలో ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక్కో విధంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తుంటుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీలను మాత్రమే వినియోగిస్తుంటారు.
పాకెట్ ప్యాక్ అంటూ
వీటిలో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఆహా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎలాంటి కంటెంట్‌ను అయిన తెలగులోనే అందిస్తోంది. అయితే, ఇప్పుడు ఆహా ఓటీటీ ఆహా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎగ్జైటింగ్ కంటెంట్‌ను మరింతమంది సబ్ స్క్రైబర్స్‌కు అందించేందుకు ‘పాకెట్ ప్యాక్’ ఆఫర్ అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ.
కేవలం 67 రూపాయలతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఇవ్వనుంది ఆహా ఓటీటీ. ఖర్చు తక్కువ, కిక్కు ఎక్కువ అనే క్యాప్షన్‌తో తీసుకొచ్చిన ఈ కొత్త చవకైన మంత్లీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 67 రూపాయలకే నెల రోజులు ఆహా ఓటీటీలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమ్ షోస్, కుకరీ షోస్‌ను చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ కోసం
ఆహాలో ఫన్ అండ్ థ్రిల్లింగ్ గేమ్ షో సర్కార్ సీజన్ 5, హోమ్ టౌన్, త్రీ రోజెస్ సీజన్ 2, అప్సర వంటి ఫ్రెష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ న్యూ ఆహా ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ కోసం రెడీ అవుతోంది. కావాల్సినంత క్రియేటివ్ తెలుగు, తమిళ రీజనల్ కంటెంట్ ఆహాలో అందుబాటులో ఉంది. ఉగాది సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ అట్రాక్టింగ్ పాకెట్ ప్యాక్ ఆహాకు పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్‌ను జాయిన్ చేయనుందని తెలుస్తోంది.
అయితే, 67 రూపాయల ఆహా ఓటీటీ ప్లాన్ కేవలం ముబైల్ యూజర్స్ కోసమే తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో 720పీ హెచ్‌డీ రెజల్యూషన్‌తో సినిమాలు క్లారిటీగా ప్రసారం అవుతాయి. కానీ, ఆ ప్లాన్‌లో యాడ్స్ కూడా వస్తుంటాయని ఆహా ఓటీటీ తెలిపింది. అయితే, అతి తక్కవ ఖర్చులో ఆహా కంటెంట్‌ను చూడటానికి మాత్రం ఇది చాలా బెటర్ ప్లాన్ అని చెప్పొచ్చు.
ఇదే ట్విస్ట్
ఈ 67 రూపాయల నెలవారీ ప్లాన్‌ను క్వాటర్లీగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే, నెలకు 67 రూపాయలు అయినప్పటికీ మూడు నెలలకు కలిపి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. అంటే, నెలకు రూ. 67 అయినా 3 నెలలకు 201 రూపాయలకు ఒకేసారి చెల్లించి ఆహా పాకెట్ ఓటీటీ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ ట్విస్ట్.
నెల పేమెంట్ కాకుండా 3 నెలల పేమెంట్‌తో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆహా ఓటీటీ సంస్థ. ఇదిలా ఉంటే, ఆహా యాన్యువల్ ప్లాన్ రూ. 399కి రానుంది. ఇందులు ఫుల్ హెచ్‌డీ 1080పీ రెజల్యూషన్ క్లారిటీతో కంటెంట్‌ను చూడొచ్చు. ఇందులో కూడా యాడ్స్ లిమిటెడ్‌గా వస్తాయి.
ఆహా గోల్డ్ ప్రీమియం
ఇక ఆహా గోల్డ్ ప్రీమియమ్ యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ రూ. 699కి వస్తుంది. ఈ ఆహా ఓటీటీ ప్రీమియమ్ ప్లాన్‌లో ఎలాంటి యాడ్స్ రావు. కంటెంట్‌ను ఎలాంటి యాడ్స్ లేకుండా చూడొచ్చు. అలాగే, 4కే అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ ఆడియోలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు వీక్షించవచ్చు.
సంబంధిత కథనం