






Best Web Hosting Provider In India 2024

Rohit Sharma: రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విమర్శలు.. ఆ కారణం వల్లే జట్టులో చోటు అంటూ..
Michael Vaughan on Rohit Sharma: ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. జట్టులో రోహిత్‍కు చోటు ఎందుకు దక్కుతుందో తన అభిప్రాయాన్ని చెప్పాడు.

ఐపీఎల్ 2025 సీజన్‍లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పాయింట్ల ఖాతా తెరిచింది. మూడో మ్యాచ్‍లో గెలిచి బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడి నిరాశలో ఉన్న ముంబై.. కోత్‍కతా నైట్‍రైడర్స్ (కేకేఆర్)తో సోమవారం (మార్చి 31) జరిగిన మ్యాచ్‍లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‍లో బోణీ కొట్టింది. అయితే, ముంబై ఇండియన్స్ సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి విఫలమ్యాడు. దీంతో రోహిత్‍పై విమర్శలు చేశాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.
ఈ సీజన్‍లో రోహిత్ శర్మ తొలి మూడు మ్యాచ్‍ల్లో ఫెయిల్ అయ్యాడు. వరుసగా 0,8,13 స్కోర్లు చేశాడు. మూడు మ్యాచ్‍ల్లో 21 పరుగులే చేయగలిగాడు. ఐపీఎల్‍లో ఐదేళ్లుగా రోహిత్ తన రేంజ్ ఫామ్‍లో లేడు. ఐదు సీజన్లు కలిపి సుమారు 400 పరుగులే చేశాడు. గతేడాదే రోహిత్‍ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇచ్చింది. కెప్టెన్‍గా ముంబైకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్.. గత సీజన్ నుంచి ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. అయితే, బ్యాటింగ్‍లోనూ తన స్థాయిలో పరుగులు చేయడం లేదు. దీనిపైనే వాన్ మాట్లాడాడు.
పేరు వల్లే తుదిజట్టులో చోటు
రోహిత్ శర్మకు ఉన్న పేరు వల్లే ముంబై ఇండియన్స్ తుదిజట్టులో అతడికి చోటు దక్కుతోందని మైకేల్ వాన్ అన్నాడు. అతడి బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా ఉందని, ఒకవేళ అతడి పేరు రోహిత్ కాకపోతే తుదిజట్టులో చోటు దక్కదని క్రిక్‍బజ్‍తో అన్నాడు.
రోహిత్ శర్మ స్థాయికి అతడు చేస్తున్న స్కోర్లు చాలా తక్కువని మైకేల్ వాన్ అన్నాడు. “అతడి నంబర్స్ చూడండి. రోహిత్ శర్మ ఇప్పుడు కెప్టెన్ కాదు.. కేవలం బ్యాటర్ మాత్రమే. అలానే జడ్జ్ చేయాలి. అతడి నంబర్స్ చాలా పేలవంగా ఉన్నాయి. ఒకవేళ అతడి పేరు రోహిత్ శర్మ కాకపోయి ఉంటే.. ఏదో దశలో తుదిజట్టులో చోటు కోల్పోయేవాడు. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్‌కు ఆ నంబర్లు సరిపోవు” అని వాన్ చెప్పాడు. రోహిత్ మళ్లీ ఫామ్‍లోకి వచ్చి రన్స్ చేస్తేనే ముంబై జట్టుకు ప్లస్ అవుతుందని అన్నాడు.
తప్పించాలని అనడం లేదు
కానీ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ తుదిజట్టు నుంచి తాను తప్పించాలని చెప్పడం లేదని మైకేల్ వాన్ అన్నాడు. మళ్లీ లయలోకి రోహిత్ రావాల్సిన అవసరం ఉందని అంటున్నానని చెప్పాడు. “నేను ఉన్నా అతడిని తప్పించను. ఆరంభం బాగా ఇవ్వాలి. మళ్లీ ఫ్లో, రిథమ్ తిరిగి తెచ్చుకోవాలి. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‍ల్లో ముంబై సరిగా ఆడలేదు. సీనియర్లు ఆ జట్టులో బాగా ఆడాల్సిన అవసరం ఉంది” అని వాన్ అన్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్‍లో తన తొలి మ్యాచ్‍లో చెన్నై చేతిలో ఓడింది ముంబై. తర్వాత గుజరాత్ చేతిలోనూ పరాజయం పాలైంది. అయితే, కోల్‍కతాతో జరిగిన మ్యాచ్‍లో విజృంభించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో 43 బంతులను మిగిల్చి మరీ విజయం సాధించింది. పాయింట్ల ఖాతా ఓపెన్ చేసింది. తదుపరి ఏప్రిల్ 4న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ముంబై తలపడనుంది.
సంబంధిత కథనం