




Best Web Hosting Provider In India 2024

Horror Thriller Movie: ముగ్గురు హీరోయిన్లతో అమరావతికి ఆహ్వానం – హారర్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
Horror Thriller Movie: హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న అమరావతికి ఆహ్వానం మూవీ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎస్తేర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ కంఠంనేని హీరోగా కనిపించబోతున్నాడు.

Horror Thriller Movie: కొన్నాళ్లుగా భాషాభేదాలతో సంబంధం లేకుండా హారర్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ముంజ్య, స్త్రీ 2 తో పాటు హారర్ థ్రిల్లర్ కథాంశాలతో రూపొందిన పలు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి.
ఈ హారర్ థ్రిల్లర్ జానర్‌లో వస్తోన్న తెలుగు మూవీ అమరావతికి ఆహ్వానం . ఈ సినిమాలో ఎస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత హీరోయిన్లుగా నటిస్తోన్నారు. `అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠంనేని హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో హరీష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి జివికె దర్శకత్వం వహిస్తున్నారు.
ఫస్ట్‌లుక్ రిలీజ్…
ఉగాది సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్‌లో లీడ్ యాక్టర్స్ అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకునిసీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫేస్ లు పూర్తిగా రివీల్ కానప్పటికీ అందరి కళ్లలో ఒకేరకమైన ఇంటెన్సిటీ ఉంది. క్రియేటివ్‌గా ఉన్న ఫస్ట్ పోస్టర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చారు మేకర్స్. అమరావతి అనే పేరుకు ఈ సినిమాకు ఉన్న లింక్ ఏమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. ఇందులోని ప్రతి పాత్ర డిఫరెంట్ వేరియేషన్స్‌తో సాగుతుంది.
పద్మనాభన్ భరద్వాజ్ మ్యూజిక్…
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జే ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్. పద్మనాభన్ బరద్వాజ్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా సాయిబాబు తలారి ఎడిటింగ్ భాద్యతలు చేపట్టారు. యాక్షన్ ఎపిసోడ్స్ అంజీ మాస్టర్ కంపోజ్ చేశారు. త్వరలో ఈ మూవీ నుండి మరిన్ని సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్‌ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.
బాపు…హత్య…
ధన్యబాలకృష్ణ ఇటీవలే బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అదరగొట్టింది. ఈ ఏడాది బాపుతో హత్య సినిమాలో కీలక పాత్ర పోషించింది ధన్య బాలకృష్ణ. లవ్ ఫెయిల్యూర్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా యాభై వరకు సినిమాలు చేసింది.
వెయ్యి అబద్దాలు, బంగారు బుల్లోడు వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది ఎస్తేర్. కొన్నాళ్లుగా తెలుగులో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటోంది.
సంబంధిత కథనం