






Best Web Hosting Provider In India 2024

OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్.. ట్విస్టులతో కూడిన మిస్టరీ
OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి ఇప్పుడో అదిరిపోయే మలయాళం కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వస్తోంది. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 1) ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా రిలీజైంది. ఇదొక ట్విస్టులతో కూడిన మిస్టరీ మూవీ.

OTT Malayalam Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మలయాళం మూవీ ఒకటి మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. వీటికి సంబంధించిన వేర్వేరు ట్రైలర్లను మంగళవారం (ఏప్రిల్ 1) సోనీ లివ్ ఓటీటీ రిలీజ్ చేసింది. జనవరిలో రిలీజై హిట్ కొట్టిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది.
ప్రావింకూడు షాప్పు ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం స్టార్ హీరో బేసిల్ జోసెఫ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రావింకూడు షాప్పు (Pravinkoody Shappu). ఈ సినిమా జనవరి 16న థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఓ కల్లు షాపులో జరిగే హత్య, దాని చుట్టూ సరదాగా సాగే ఇన్వెస్టిగేషన్, ట్విస్టులతో ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి రానుండటంతో మనవాళ్లను కూడా థ్రిల్ చేయనుంది. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 1) తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
ప్రావింకూడు షాప్పు మూవీ గురించి..
మలయాళంలో వచ్చిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రావింకూడు షాప్పు. ఈ ఏడాది జనవరి 16న థియేటర్లలో రిలీజైంది. శ్రీరాజ్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేశాడు. బేసిల్ జోసెఫ్ తోపాటు సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ లాంటి వాళ్లు కూడా నటించారు. విష్ణు విజయ్ మ్యూజిక్ అందించాడు. ఇదొక డిఫరెంట్ స్టోరీతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.
ఓ కల్లు దుకాణంలో జరిగిన హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ దుకాణం యజమానే హత్యకు గురవుతాడు. అయితే దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఆ రోజు రాత్రంతా ఆ షాపులోనే 11 మంది మందు తాగుతూ, పేకాట ఆడుతూ ఉంటారు. దీంతో సహజంగానే ఈ హత్య కేసులో వాళ్లే ప్రధాన అనుమానితులుగా ఉంటారు.
ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆ 11 మందినీ అతడు ప్రశ్నిస్తాడు. కానీ ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అధికారి ఆ హత్య కేసును ఎలా ఛేదిస్తాడన్నది మూవీ లో చూడొచ్చు. ఊహించని ట్విస్టులతో సాగే మిస్టరీ మూవీ ఇది. ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతోంది.
సంబంధిత కథనం