




Best Web Hosting Provider In India 2024
Anant Ambani: జామ్ నగర్ నుంచి ద్వారకా వరకు అనంత్ అంబానీ పాదయాత్ర; ఎందుకో తెలుసా?
Anant Ambani: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ అకస్మాత్తుగా పాదయాత్ర చేపట్టారు. గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి ద్వారక వరకు ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక పాదయాత్ర అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Anant Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ జామ్ నగర్ నుంచి ద్వారకా వరకు 140 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. గత సంవత్సరం అనంత్ అంబానీ తన చిన్నప్పటి స్నేహితురాలు రాధికా మర్చంట్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా, గతవారం అనంత్ అంబానీ ఈ పాదయాత్రను ప్రారంభించారు.
అనంత్ అంబానీ 140 కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు వెళ్తున్నారు?
అనంత్ అంబానీ శ్రీకృష్ణుడి భక్తుడు. మరోవైపు, ద్వారక కృష్ణుడి అడుగుజాడలు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం. అందుకే తన 30వ జన్మదినాన్ని పురస్కరించుకుని అనంత్ అంబానీ పాదయాత్ర చేసి ద్వారకలో ద్వారకాధీషుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ 140 కిలోమీటర్ల పాదయాత్రను అనంతర్ అంబానీ 5 రోజుల క్రితమే ప్రారంభించారు. అనంత్ అంబానీ కాలినడకన ద్వారకా చేరుకోవడానికి మరో రెండు నుండి నాలుగు రోజులు పట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యువతకు అనంత్ అంబానీ సందేశం
పాదయాత్ర సందర్బంగా అనంత్ అంబానీ విలేకరులతో మాట్లాడారు. ఏదైనా పనిని ప్రారంభించడానికి ముందు ద్వారకాధీషుడిని తాను ఎల్లప్పుడూ స్మరించుకున్నానని, దాంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ పని పూర్తవుతుందని అన్నారు. ‘‘జామ్ నగర్ లోని మా ఇంటి నుంచి ద్వారక వరకు పాదయాత్ర ఉంది. గత ఐదు రోజులుగా ఇది కొనసాగుతోంది. మరో రెండు, నాలుగు రోజుల్లో ద్వారకా చేరుకుంటాం’’ అని చెప్పారు. ‘‘ద్వారకాధీషుడైన కృష్ణుడిపై విశ్వాసం ఉంచాలని, ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీష్ దేవుడిని స్మరించుకోవాలని యువతకు నేను చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు ఆ పని ఎలాంటి ఆటంకం లేకుండా తప్పకుండా పూర్తవుతుంది. భగవంతుడు ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని అనంత్ అంబానీ అన్నారు.
అనంత్ అంబానీ 140 కిలోమీటర్ల పాదయాత్ర గురించి
అనంత్ అంబానీ జామ్ నగర్ లోని మోతీ ఖావ్డీ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. జెడ్ స్థాయి భద్రత, స్థానిక పోలీసు రక్షణతో ఆయన ప్రతి రాత్రి 10-12 కిలోమీటర్లు నడుస్తుంటారు. ఏప్రిల్ 10వ తేదీన తన 30వ పుట్టినరోజును అనంత్ అంబానీ ద్వారకాధీషుడి ఆలయంలో ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో జరుపుకోనున్నారు.
వంతరాకు ‘ప్రాణి మిత్ర’ జాతీయ అవార్డు
ఆధ్యాత్మికత, భక్తితో పాటు అనంత్ అంబానీ వన్యప్రాణి సంరక్షణ, రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ఇనిషియేటివ్ అయిన వంతరాకు ‘కార్పొరేట్’ కేటగిరీ కింద ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ జాతీయ అవార్డు లభించింది. జంతు సంక్షేమంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం అయిన ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. సురక్షితమైన మరియు స్థిరమైన వాతావరణంలో వాటి శ్రేయస్సును నిర్ధారించేటప్పుడు జంతువులను రక్షించడం మరియు పునరావాసం చేయడంపై వంతరా దృష్టి పెడుతుంది. రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏనుగుల రక్షణ, చికిత్స మరియు జీవితకాల సంరక్షణకు అంకితమైన వంతరా ఆధ్వర్యంలోని సంస్థ చేసిన అసాధారణ కృషిని గుర్తించి ఈ అవార్డు లభించింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link