Land Pattas To Poor : మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన మంత్రి లోకేష్- ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ

Best Web Hosting Provider In India 2024

Land Pattas To Poor : మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన మంత్రి లోకేష్- ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ

Bandaru Satyaprasad HT Telugu Published Apr 01, 2025 07:27 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Apr 01, 2025 07:27 PM IST

Land Pattas To Poor : మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని ఎన్నికల సమయంలో లోకేష్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు మంగళగిరిలో పేదల వివరాలు సేకరించి మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమం ద్వారా వారికి ఇళ్ల పట్టాలు అందించనున్నారు.

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన మంత్రి లోకేష్- ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన మంత్రి లోకేష్- ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

Land Pattas To Poor : మంగళగిరి నియోజకవర్గంలో….లోకేష్ హామీ ఇస్తే నెరవేరినట్టే అని స్థానికులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలో 91,413 ఓట్ల భారీ మెజారిటీతో నారా లోకేష్ గెలిచారు. గెలిచిన మొదటి రోజు నుంచే హామీలపై దృష్టి పెట్టిన ఆయన…ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు.

ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఇళ్ల పట్టాల సమస్య. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వారంతా తాము నివసిస్తున్న భూమిని, రెక్కల కష్టంతో నిర్మించుకున్న గూడుని క్రమబద్దీకరించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది నాయకులు వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ ఎవరూ పరిష్కరించలేదు. అయితే మంత్రి లోకేష్ తన హామీని నిలబెట్టుకున్నారు. గత పది నెలల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరణ దగ్గర నుంచి వివిధ శాఖలతో సమన్వయం, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులే ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు నింపడం వరకూ అన్నీ దశలను నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు.

అటవీ, రైల్వే భూముల సమస్యను పరిష్కరించి

అత్యంత క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూముల సమస్యను కూడా పట్టుదలగా తీసుకోని పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. మొదటి దశలో 3 వేల ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, వారు నిర్మించుకున్న ఇంటిని క్రమబద్దీకరిస్తూ శాశ్వత హక్కు కల్పిస్తూ ఇంటి పట్టాలు అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్. పట్టాల పంపిణీతో పేదలకు భరోసా లభించనుంది. ఏప్రిల్ 3న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో అందజేయనున్నారు. నారా లోకేష్ స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

పలు ప్రాంతాల్లో

ఏప్రిల్ 4 తేదీ నుంచి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ ను అనుకోని ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న వేదికపై లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 4న యర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్దిదారులకు నారా లోకేష్ పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 7న పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలనుకొండ, పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్దిదారులకు పట్టాలు అందజేస్తారు, ఏప్రిల్ 8న రత్నాల చెరువు, మహానాడు-2కు చెందిన లబ్దిదారులకు పట్టాలు అందజేస్తారు, ఏప్రిల్ 11న సీతానగరం, సలాం సెంటర్, డ్రైవర్స్ కాలనీకు చెందిన లబ్దిదారులకు, ఏప్రిల్ 12 న మహానాడు-1, ఉండవల్లి సెంటర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు లోకేష్ పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా మూడు వేలకు పైగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Nara LokeshAndhra Pradesh NewsTrending ApTelugu NewsMangalagiri Assembly Constituency
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024