




Best Web Hosting Provider In India 2024

Zee Telugu New Serial: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్.. ప్రారంభమయ్యే తేదీ, టైమ్ ఇదే
Zee Telugu New Serial: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్ వస్తోంది. వచ్చే వారం నుంచి ఈ సీరియల్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ ఓ ప్రోమో రిలీజ్ చేయడం ద్వారా వెల్లడించింది.

Zee Telugu New Serial: ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. ఈ సీరియల్ పేరు దీర్ఘసుమంగళీభవ. తాజాగా ఈ సీరియల్ ప్రోమోను కూడా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఈ సీరియల్ టెలికాస్ట్ తేదీ, టైమ్ ను కూడా అనౌన్స్ చేసింది.
“ప్రాణత్యాగంతో మొదలైన ఇంద్ర గౌతమ్ ల స్నేహ బంధం.. భవిష్యత్తులో అహల్య కోసం మరో ప్రాణత్యాగానికి దారితీయనుందా” అంటూ ఈ సీరియల్ స్టోరీ గురించి జీ తెలుగు ఛానెల్ చెప్పింది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ సీరియల్ ప్రోమో కూడా రిలీజైంది.
ఇందులో ఇంద్ర, గౌతమ్ పాత్రలను పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచే స్నేహ బంధంతో ఒక్కటవుతారు ఈ ఇద్దరూ. అయితే పెరిగి పెద్దయిన తర్వాత వీళ్లిద్దరి మధ్య అహల్య అనే అమ్మాయి కోసం విభేదాలు వస్తాయా అన్నట్లుగా ప్రోమోలో చూపించారు.
జీ తెలుగు సీరియల్స్ షెడ్యూల్
జీ తెలుగు ఛానెల్ ఈ మధ్య సీరియల్స్ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసింది. కొన్నాళ్ల కిందట ఆదివారం కూడా సీరియల్స్ అంటూ జీ తెలుగు ఓ వినూత్నప్రయోగానికి తెర తీసిన విషయం తెలుసు కదా. అయితే ఇప్పుడు దానికి ముగింపు పలికింది.
ముఖ్యంగా ప్రైమ్ టైమ్ అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 మధ్య సీరియల్స్ ఇక ఆదివారం ఉండబోవని వెల్లడించింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి 10.30 మధ్య కూడా సీరియల్స్ ఉండవు. కొన్ని సీరియల్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు.. మరికొన్ని సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు టెలికాస్ట్ కానున్నాయి.
శనివారం వరకు వచ్చే సీరియల్స్ ఇవే
జీ తెలుగు ఛానెల్ ఈ మధ్యే సీరియల్స్ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఇక నుంచి మా అన్నయ్య సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత 6.30 గంటలకు నిండు నూరేళ్ల సావాసం, 7 గంటలకు లక్ష్మీ నివాసం, 7.30 గంటలకు మేఘ సందేశం, 8 గంటలకు పడమటి సంధ్యారాగం, 8.30 గంటలకు చామంతి సీరియల్స్ ప్రసారమవుతాయి.
శుక్రవారం వరకు వచ్చేవి ఇవే
ఇక ప్రైమ్ టైమ్ లో వచ్చే మూడు సీరియల్స్ మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకే టెలికాస్ట్ కానున్నాయి. ఇవన్నీ రాత్రి 9 నుంచి 10.30 గంటల మధ్య టెలికాస్ట్ అయ్యేవే. ఇక నుంచి జగద్ధాత్రి సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఆ తర్వాత 9.30 గంటలకు అమ్మాయిగారు, 10 గంటలకు ప్రేమ ఎంత మధురం టెలికాస్ట్ అవుతాయి.
సంబంధిత కథనం