




Best Web Hosting Provider In India 2024

Court OTT Release: ఓటీటీలో ఐదు భాషల్లో రానున్న బ్లాక్‍బస్టర్ కోర్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Court OTT Release: కోర్ట్ సినిమా బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలివే..

ప్రియదర్షి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ మార్చి 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. నేచులర్ స్టార్ నాని సమర్పించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆరంభం నుంచి జోరుగా వసూళ్లను సాధించింది. ఈ కోర్ట్ చిత్రం ఇక ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేనుంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు!
కోర్ట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు ఆ ఓటీటీ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు బయటికి వచ్చాయి. అయితే, ఆ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐదు భాషల్లో..
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కోర్ట్ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. థియేటర్లలో తెలుగులో ఒక్కటే రిలీజైన ఈ మూవీ.. ఓటీటీలో ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులో థియేటర్లలో బంపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం.. ఓటీటీలో ఇతర భాషల్లోనూ మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశం ఉంది.
కోర్ట్ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ, పోక్సో కేసు, కోర్టులో వాదనల చుట్టూ ఆసక్తికరంగా ఈ మూవీని తెరకెక్కించారు. గ్రిప్పింగ్ నరేషన్‍తో ఎంగేజింగ్‍గా ఈ సినిమాను రూపొందించారు. కోర్ట్ సీన్లను పకబ్బందీగా రాసుకొని.. అంతే పక్కాగా చూపించారు. దీంతో ప్రేక్షకులను ఈ చిత్రం విపరీతంగా మెప్పించింది.
కమర్షియల్‍గా బంపర్ హిట్
కోర్ట్ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రూ.10కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ.. అంతకు ఐదు రెట్లకు పైగా వసూళ్లను సాధించి బంపర్ హిట్ కొట్టింది. లోబడ్జెట్ లీగల్ డ్రామా చిత్రంగా వచ్చిన ఆ రేంజ్ కలెక్షన్లను సాధించి ఈ చిత్రం ఆశ్చర్యపరిచింది.
నాని సమర్పకుడిగా ఉండడంతో కోర్ట్ చిత్రంపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కూడా మెప్పించేలా ఉండటంతో భారీ కలెక్షన్లు సాధ్యమయ్యాయి. ఈ మూవీలో న్యాయవాదిగా ప్రియదర్శి ఆకట్టుకున్నారు. హర్ష్ రోహణ్, శ్రీదేవి కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. శివాజీ పోషించిన మంగపతి పాత్ర చాలా పాపులర్ అయింది. ఈ క్యారెక్టర్లో ఆయన జీవించేశారు. హర్షవర్దన్ కూడా న్యాయవాదిగా చేశారు. సీనియర్ నటుడు సాయికుమార్ పాత్ర కాసేపే కనిపించినా ఎఫెక్టివ్‍గా ఉంటుంది. రోహిణి,సురభి పార్వతి కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా బలంగా నిలిచింది.
కోర్ట్ సినిమాకు ప్రశాంతి త్రిపురనేని, దీప్తి గంటా నిర్మాతలుగా ఉన్నారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ అయింది.
సంబంధిత కథనం