





Best Web Hosting Provider In India 2024

Jana Nayagan OTT: దళపతి విజయ్ చివరి సినిమా ఓటీటీ హక్కులకు కళ్లు చెదిరే మొత్తం.. ఈ ప్లాట్‌ఫామ్‌లోకే రానున్న మూవీ
Jana Nayagan OTT: దళపతి విజయ్ నటస్తున్న చివరి సినిమా జన నాయగన్. ఈ మధ్యే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయగా.. ఇప్పుడీ మూవీ ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Jana Nayagan OTT: జన నాయగన్.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినిమా కెరీర్లో నటిస్తున్న చివరి మూవీ. ఆ తర్వాత అతడు పూర్తిగా రాజకీయాలకే అంకితం కానున్నాడు. దీంతో ఈ జన నాయగన్ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ నెలకొంది. ఆ క్రేజే ఇప్పుడీ మూవీ ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి అమ్ముడయ్యేలా చేసింది.
జన నాయగన్ ఓటీటీ హక్కులు
జన నాయగన్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. జన నాయగన్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా రూ.121 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
దళపతి విజయ్ చివరి సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డులను తిరగ రాస్తుందని భావిస్తున్న ఈ మూవీ డిజిటల్ హక్కులకు ఈ మాత్రం కామనే అని అతని ఫ్యాన్స్ అంటున్నారు. హెచ్ వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ కెరీర్లో ఇది 69వ మూవీ.
ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి..
దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత కనీసం ఎనిమిది వారాలకు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోనే సొంతం చేసుకుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ లోనే వస్తుందని భావించినా.. వచ్చే ఏడాది పొంగల్ కు వాయిదా వేశారు. తమిళనాడులోనూ 2026లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ జన నాయగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.
ఈ యాక్షన్ డ్రామాలో మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దళపతి విజయ్ చివరి సినిమా కావడం, తర్వాత తమిళనాడు ఎన్నికల్లో అతని పార్టీ పోటీ చేయనుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ద్వారా విజయ్ తనకున్న ఫాలోయింగ్ ఎలాంటిదో చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నాడు.
సంబంధిత కథనం