




Best Web Hosting Provider In India 2024
Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 18 మంది మృతి
Explosion: గుజరాత్ లోని బనస్కాంతలో మంగళవారం భారీ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని, దీంతో మొత్తం ఆర్సీసీ స్లాబ్ కూలిపోయిందని బనస్కాంత కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు.

Explosion at firecracker factory: గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడులో 18 మంది మృతి చెందారు. దీసా పట్టణానికి సమీపంలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురికి గాయాలు కాగా వారి పరిస్థితి నిలకడగా ఉంది.
కూలిన స్లాబ్
ఉదయం 9:45 గంటలకు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని, ఈ పేలుడు ధాటికి ఆర్సీసీ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయిందని, దాంతో ఆ శిధిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారని, బనస్కాంత కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. ‘‘ఫ్యాక్టరీ శిథిలాల నుంచి ఇప్పటి వరకు 18 మృతదేహాలను వెలికితీశారు. ఆర్సీసీ స్లాబ్ మొత్తం కూలిపోయింది. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి’’ అని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, ఎఫ్ఎస్ఎల్ బృందం ఆధారాలను సేకరించిందని తెలిపారు.
బాణసంచా తయారు చేస్తుండగా
ఫ్యాక్టరీలో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించిందని బనస్కాంత కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. పలువురు కార్మికుల కుటుంబ సభ్యులు కూడా శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగి భవనంలో కొంత భాగం కూలిపోవడంతో పలువురు చిక్కుకున్నారని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నేహా పంచల్ తెలిపారు.
సహాయక చర్యలు
శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బనస్కాంత ఎస్పీ అక్షయ్రాజ్ మక్వానా తెలిపారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం కూడా సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలు చేపట్టింది.
వెస్ట్ బెంగాల్ లో కూడా..
మరోవైపు, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సుందర్బన్స్ లోని మారుమూల పథర్ప్రతిమా ప్రాంతంలో సోమవారం రాత్రి హోమ్ కమ్ ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన బాణసంచా పేలడంతో ఒక కుటుంబానికి చెందిన పిల్లలతో సహా ఎనిమిది మంది మరణించారు. చంద్రకాంత బానిక్ కు చెందిన హోమ్ కమ్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా డైమండ్ హార్బర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link