OTT movie: ఓటీటీలోకి మరో తెలుగు మూవీ.. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఒకే రోజు రెండు ఫ్రీ మూవీస్

Best Web Hosting Provider In India 2024

OTT movie: ఓటీటీలోకి మరో తెలుగు మూవీ.. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఒకే రోజు రెండు ఫ్రీ మూవీస్

Hari Prasad S HT Telugu
Published Apr 01, 2025 03:06 PM IST

OTT movie: ఓటీటీలోకి మరో తెలుగు సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీని ఎవరైనా సరే సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే అవకాశం కల్పించడం విశేషం. మరి ఆ మూవీ ఏది? ఎక్కడ, ఎప్పుడు చూడాలన్న విషయాలు తెలుసుకోండి.

ఓటీటీలోకి మరో తెలుగు మూవీ.. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఒకే రోజు రెండు ఫ్రీ మూవీస్
ఓటీటీలోకి మరో తెలుగు మూవీ.. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఒకే రోజు రెండు ఫ్రీ మూవీస్

OTT movie: ఓటీటీలోకి చిన్న సినిమాలను ఎక్కువగా తీసుకొచ్చే ఈటీవీ విన్ మరో తెలుగు మూవీని అందిస్తోంది. తెలుగు ప్రేక్షకులందరూ ఉచితంగా ఈ సినిమాను చూసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఒకే రోజు ఇలా రెండు సినిమాలను ఫ్రీగా తీసుకురానుండటం విశేషం. ఆ మూవీస్ ఏంటో చూడండి.

ఉత్తరం ఓటీటీ రిలీజ్ డేట్

ఈటీవీ విన్ ఓటీటీ ఈ వీకెండ్ మరో తెలుగు సినిమాను తీసుకొస్తోంది. ఈ మూవీ పేరు ఉత్తరం. కథాసుధ అందిస్తున్న సినిమా ఇది. దీనిని ఫ్రీగా ఎవరైనా చూడొచ్చని ఆ ఓటీటీ తెలిపింది. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 6) నుంచి ఈ మూవీని ఈటీవీ విన్ లో చూడొచ్చు.

“పదాల్లోనే ప్రేమ, ఉత్తరాల్లో భావోద్వేగాలు ఉన్నప్పటి రోజులు.. ఈ స్మార్ట్‌ఫోన్లు, ఇన్‌స్టాంట్ మెసేజింగ్ కంటే ముందు ప్రేమను ఇంక్, పేపర్ తోనే తెలియజేసేవారు. కథాసుధ నుంచి ఉత్తరం. ఏప్రిల్ 6 నుంచి స్ట్రీమింగ్. ఈటీవీ విన్ లో ఫ్రీగా చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.

శతమానం భవతి మూవీతో పాపులర్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ ఈ మూవీని నిర్మించడం విశేషం.

ఫ్రీగా మరో మూవీ కూడా..

ఇక ఈటీవీ విన్ ఓటీటీలోకే ఏప్రిల్ 6న మరో మూవీ కూడా అడుగుపెడుతోంది. దీనిని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమా పేరు లైఫ్ పార్ట్‌నర్. దీనిని కూడా కథాసుధనే అందిస్తోంది. క‌థాసుధ పేరుతో కొత్త ద‌ర్శ‌కుల‌తో కొన్ని సినిమాల‌ను రూపొందించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే ఈటీవీ విన్ ప్ర‌క‌టించింది.

ఈ క‌థాసుధ‌లో భాగంగా ప్ర‌తి ఆదివారం ఓ సినిమా ఈటీవీ విన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాల‌ను సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ప్రొడ్యూస్ చేశారు. ఈ క‌థాసుధ‌లో భాగంగా తొలి మూవీగా లైఫ్ పార్ట్‌న‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

లైఫ్ పార్ట్‌న‌ర్ మూవీలో శ్రీహాన్‌కు జోడీగా సోనియా సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. లైఫ్ పార్ట్‌న‌ర్ మూవీకి ప్రొడ్యూస‌ర్‌గానే కాకుండా లిరిక్స్‌, స్క్రీన్‌ప్లేను అందిస్తూనే ద‌ర్శ‌క‌త్య ప‌ర్య‌వేక్ష‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాంకీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

స్కూల్‌లో ప్రేమించిన ఓ అమ్మాయి….చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ యువ‌కుడి జీవితంలోకి ఎలా ఎంట‌రైంది? వారి ప్రేమ క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నే కాన్సెప్ట్‌తో లైఫ్ పార్ట‌న‌ర్ మూవీ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024