






Best Web Hosting Provider In India 2024

Telugu OTT: ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ – రన్ టైమ్ 30 నిమిషాలే – ఫ్రీ స్ట్రీమింగ్
బిగ్‌బాస్ రన్నరప్ శ్రీహాన్ హీరోగా నటించిన లైఫ్ పార్టనర్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 6న రిలీజ్ కాబోతోంది. సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు నిర్మించిన ఈ మూవీలో సోనియా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది

Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ శ్రీహాన్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ లైఫ్ పార్ట్‌నర్ ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 6న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ మంగళవారం అఫీషియల్‌గా ప్రకటించింది. లైఫ్ పార్టనర్ మూవీని సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగా చూడొచ్చని ఈటీవీ విన్ ప్రకటించింది.
కథాసుధలో ఫస్ట్ మూవీ…
కథాసుధ పేరుతో కొత్త దర్శకులతో కొన్ని సినిమాలను రూపొందించబోతున్నట్లు ఇటీవలే ఈటీవీ విన్ ప్రకటించింది. . ఈ కథాసుధలో భాగంగా ప్రతి ఆదివారం ఓ సినిమా ఈటీవీ విన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలను సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేశారు. ఈ కథాసుధలో భాగంగా తొలి మూవీగా లైఫ్ పార్ట్‌నర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రన్‌టైమ్ ముప్ఫై నిమిషాలు ఉండబోతున్నట్లు సమాచారం.
శ్రీహాన్‌కు జోడీగా…
లైఫ్ పార్ట్‌నర్ మూవీలో శ్రీహాన్‌కు జోడీగా సోనియా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. లైఫ్ పార్ట్‌నర్ మూవీకి ప్రొడ్యూసర్‌గానే కాకుండా లిరిక్స్, స్క్రీన్‌ప్లేను అందిస్తూనే దర్శకత్య పర్యవేక్షకుడిగా రాఘవేంద్రరావు వ్యవహరిస్తున్నారు. రాంకీ దర్శకత్వం వహిస్తున్నారు.
స్కూల్‌లో ప్రేమించిన ఓ అమ్మాయి….చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఓ యువకుడి జీవితంలోకి ఎలా ఎంటరైంది? వారి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే కాన్సెప్ట్‌తో లైఫ్ పార్టనర్ మూవీ సాగనున్నట్లు సమాచారం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న శ్రీహాన్ ఫైనల్ చేరుకున్నాడు. అతడే విన్నర్ అవుతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ శ్రీహాన్‌కు షాకిస్తూ సింగర్ రేవంత్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. బిగ్‌బాస్ సీజన్ 6లో విన్నర్ రేవంత్ కంటే రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్ ఎక్కువగా ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. దాదాపు 71 లక్షల వరకు అతడికి ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు. బిగ్‌బాస్ తర్వాత మా అవారా జిందగీ పేరుతో ఓ మూవీ చేశాడు.
విరూపాక్ష మూవీతో…
లైఫ్ పార్ట్‌నర్‌లో హీరోయిన్‌గా నటిస్తోన్న సోనియా సింగ్ కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌లతోనే ఫేమస్ అయ్యింది. సాయిధరమ్‌తేజ్ విరూపాక్ష మూవీలో కీలక పాత్ర పోషించింది. సోనియా సింగ్ నటించిన శశిమథనం వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది.
సంబంధిత కథనం