






Best Web Hosting Provider In India 2024

Horror Movie: తెలుగులోకి వస్తోన్న యాభై కోట్ల మలయాళం బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ – డైరెక్ట్‌గా టీవీలో టెలికాస్ట్!
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళం మూవీ ఎజ్రా తెలుగులో డైరెక్ట్‌గా టీవీలోకి రాబోతోంది. త్వరలోనే జీ తెలుగు ఛానెల్‌లో ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. ఎజ్రా మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించగా…టోవినో థామస్ ఓ కీలక పాత్ర పోషించాడు.

Horror Movie: మలయాళం హారర్ మూవీ ఏజ్రా తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. జీ తెలుగు ఛానెల్‌లో ఈ మూవీ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అఫీషియల్‌గా ప్రకటించింది. ఎజ్రా వరల్డ్ టెలిలివిజన్ ప్రీమియర్ డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని వెల్లడించింది.
ఈ శనివారం లేదా ఆదివారం ఏజ్రా తెలుగులో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం.మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా టీవీలోకి వస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరో…
ఏజ్రా మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించాడు. ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో టోవినో థామస్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి జయ్ కే దర్శకత్వం వహించాడు. 2017లో థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హాలీవుడ్ మూవీ ది పొసేషన్ ఆధారంగా ఏజ్రా మూవీ తెరకెక్కినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
ప్రియాను ఆవహించిన ఆత్మ…
రెగ్యులర్ హారర్ మూవీస్‌కు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు జయ్ ఏజ్రా సినిమాను తెరకెక్కించారు. రంజన్ మాథ్యూ (పృథ్వీరాజ్ సుకుమారన్ )న్యూక్లియర్ ప్లాంట్‌లో పనిచేయడానికి ముంబై నుంచి కొచ్చికి ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. ప్రియాను (ప్రియా ఆనంద్) ప్రేమించిన రంజన్ పెద్దలను ఎదురించి ఆమెను పెళ్లిచేసుకుంటాడు.
ఓ పాతకాలం నాటి యాంటిక్ బాక్స్ ప్రియ కొంటుంది. ఆ యాంటిక్ బాక్స్ కొన్నప్పటి నుంచి ప్రియా వింతగా వ్యవహరిస్తుంది. ఆమెకు దయ్యం పట్టిందని రంజన్ గ్రహిస్తాడు. ప్రియాను ఆవహించిన ఆ ఆత్మ ఎవరిది? అబ్రహం ఎజ్రా ఎవరు? అబ్రహం ప్రేమించిన రోజి ఎలా చనిపోయింది? ఎజ్రా ఆత్మగా మారిపోయి పగలో రగిలిపోవడానికి కారణం ఏమిటి? తన భార్యను రంజన్ ఎలా కాపాడుకున్నాడు? అతడికి పోలీస్ ఆఫీసర్ షఫీర్ ఎలా సాయం చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
హిందీలో రీమేక్…
ఎజ్రా మూవీ డైబుక్ పేరుతో హిందీలోకి రీమేక్ అయ్యింది. ఈ రీమేక్‌లో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించాడు. హిందీ వెర్షన్ మాత్రం డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
ఎంపురన్ 200కోట్లు…
పృథ్వీరాజ్‌సుకుమార్ దర్శకత్వం వహించిన ఎల్2 ఎంపురన్ మూవీ ఇటీవల పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే రెండు వందల కోట్ల వసూళ్లను రాబట్టింది. ఎంపురన్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గెస్ట్ పాత్రలో కనిపించగా…టోవినో థామస్ ఓ కీలక పాత్ర పోషించాడు.
సంబంధిత కథనం