Political Thriller OTT: ఓటీటీలోకి తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Best Web Hosting Provider In India 2024

Political Thriller OTT: ఓటీటీలోకి తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Nelki Naresh HT Telugu
Published Apr 02, 2025 06:05 AM IST

Thriller OTT: అప్స‌ర‌రాణి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రాచ‌రికం థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఏప్రిల్ 11 నుంచి ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టించాడు.

పొలిటికల్ థ్రిల్లర్ ఓటీటీ
పొలిటికల్ థ్రిల్లర్ ఓటీటీ

Thriller OTT: అప్స‌ర‌రాణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు మూవీ రాచ‌రికం ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో ఏప్రిల్ 11న విడుద‌ల‌కానుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ల‌య‌న్స్ గేట్ ప్లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

వ‌రుణ్ సందేశ్ విల‌న్‌…

రాచ‌రికం మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టించాడు. అప్స‌ర‌రాణికి జోడీగా విజ‌య్ శంక‌ర్ క‌నిపించాడు. ఈ తెలుగు మూవీకి సురేష్ లంక‌ల‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 31న‌ ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. రెండు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది.

9.3 రేటింగ్‌…

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ‌, రివేంజ్, పొలిటిక‌ల్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. గ‌తంలో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసిన అప్స‌ర‌రాణి ఇందులో మాత్రం ప్రేమికురాలిగా, పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించింది.

రాచ‌రికం స్టోరీ ఏంటంటే?

రాచ‌కొండ ప్రాంతానికి రాజారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్‌) నాయ‌కుడిగా ఉంటాడు. రాచ‌కొండ‌తో త‌న‌కు పోటీ లేకుండా ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా గెలుస్తూ వ‌స్తుంటాడు. రాజారెడ్డి కొడుకు వివేక్ రెడ్డి (వ‌రుణ్ సందేశ్‌)తో పాటు కూతురు భార్గ‌వి రెడ్డి (అప్స‌రా రాణి) తండ్రి బాట‌లోనే రాజ‌కీయాల్లోకి అడుగుపెడతారు. శివ (విజ‌య్ శంక‌ర్‌) అనే యువ‌కుడిని భార్గ‌వి రెడ్డి ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కార‌ణంగా రాజారెడ్డి రాజ‌కీయ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది?శివ‌, భార్గ‌వి ప్రేమ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డుగోడ‌లుగా నిలిచాయి?

రాచ‌కొండ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని శివ ప‌ట్టుప‌ట్ట‌డానికి కార‌ణం ఏమిటి? రాజ‌కీయాల్లో వివేక్ రెడ్డికి భార్గ‌వి ప్ర‌త్య‌ర్థిగా ఎందుకు మారింది? వీరి క‌థ‌లో భైర్రెడ్డి , క్రాంతి(ఈశ్వ‌ర్‌) పాత్రలు ఏమిటి? రాచ‌కొండ‌లో మార్పు కోసం భార్గ‌వి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది అన్న‌దే రాచ‌రికం మూవీ క‌థ‌.

రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమాల్లో…

4 లెట‌ర్స్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అప్ప‌ర రాణి. రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన డీ కంపెనీ, డేంజ‌ర‌స్ సినిమాల్లో న‌టించింది. ర‌వితేజ క్రాక్‌, గోపీచంద్ సీటీమార్‌తో పాటు హంట్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసింది. త‌ల‌కోన అనే యాక్ష‌న్ మూవీలో హీరోయిన్‌గా క‌నిపించింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024