




Best Web Hosting Provider In India 2024

OTT Romantic: ఓటీటీలోకి అల్ట్రా డిజాస్టర్ మూవీ.. స్టార్ హీరో కుమారుడికి భారీ ప్లాఫ్.. స్ట్రీమింగ్ వివరాలివే
OTT Romantic: లవ్‍యాపా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన లవ్‍యాపా చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తమిళంలో బ్లాక్‍బస్టర్ అయిన లవ్‍టుడే మూవీకి హిందీ రీమేక్‍గా ఇది తెరకెక్కింది. అయితే, లవ్‍యాపా నెగెటివ్ టాక్ తెచ్చుకొని భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ లవ్‍యాపా చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే
లవ్‍యాపా చిత్రం ఏప్రిల్ 4వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో రానుందని తెలుస్తోంది. హిందీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
సూపర్ హిట్ మూవీకి రీమేక్ అయినా..
లవ్‍యాపా చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఇద్దరు ప్రేమికులు ఒకరి ఫోన్ ఒకరు మార్చుకోవడం చుట్టూ ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం సాగుతుంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన లవ్‍టుడే చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయింది. ఆ చిత్రానికి హిందీ రీమేక్‍గా వచ్చిన ఈ లవ్‍యాపా మాత్రం కొట్టింది. డైరెక్టర్ అద్వైత్ చందన్ ప్రేక్షకులు మెచ్చేలా ఈ రీమేక్‍ను రూపొందించలేకపోయారు.
బాక్సాఫీస్ డిజాస్టర్
లవ్‍యాపా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది. సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం కనీసం రూ.10కోట్ల కలెక్షన్లను కూడా దక్కించుకోలేదు. బడ్జెట్‍లో ఆరో వంతు వసూళ్లను కూడా రాబట్టలేక అల్ట్రా డిజాస్టర్ అయింది ఈ మూవీ. ఆమిర్ కుమారుడు జునైద్‍కు ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్‍లోనే భారీ ప్లాఫ్ ఎదురైంది.
లవ్‍యాపా మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫాంటమ్ స్టూడియోస్ పతాకాలపై కల్పాతి అఘోరం, కల్పాతి గమేశ్, కల్పాతి సురేశ్, ప్రదీప్ రంగనాథ్, మధుమంతెన, భావన తల్వార్, సృష్టి ఆర్య సంయుక్తంగా నిర్మించారు. ప్రొడ్యూజర్లకు ఈ చిత్రం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో జునైద్, ఖుషితో పాటు అశుతోష్ రాణా, గ్రుష కపూర్, కికు శ్రద్ధా, ఆదిత్య, దేవిశి మదాన్ కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో భారీ డిజాస్టర్ అయిన ఈ సినిమా జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
లవ్‍యాపా స్టోరీలైన్
గౌరవ్ సచ్‍దేవ్ (జునైద్ ఖాన్), బానీ (ఖుషీ కపూర్) లవ్ స్టోరీ చుట్టూ లవ్‍యాపా చిత్రం సాగుతుంది. బానీ తండ్రి అతుల్‍ను పెళ్లికి ఒప్పించేందుకు వారి ఇంటికి వెళతాడు గౌరవ్. అయితే, ఇద్దరి ప్రేమను అంగీకరించాలంటే కొన్ని రోజుల ఒకరి ఫోన్‍ను మరొకరు మార్చుకోవాలని బానీ తండ్రి కండీషన్ పెడతాడు. గౌరవ్, బానీ ఒకరి ఫోన్‍లో ఒకరు ఏం చూశారు? వారిద్దరి రిలేషన్‍పై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? గొడవలు జరిగాయా? చివరికి ఒక్కయ్యారా అనేవి లవ్‍యాపా చిత్రంలో ఉంటాయి.
తెలుగు వెబ్ సిరీస్ ‘టచ్ మీ నాట్’ ఏప్రిల్ 4వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలీ ప్రసాద్, పూనచా సాంకో ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వత్థామ ఫేమ్ డైరెక్టర్ సిరీస్‍కు రమణ తేజ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం
టాపిక్