Baby Names: మీ పాప కోసం అందమైన పేర్లను ఇక్కడ ఇచ్చాము, వీటిలో చక్కటి పేరును ఎంచకోండి

Best Web Hosting Provider In India 2024

Baby Names: మీ పాప కోసం అందమైన పేర్లను ఇక్కడ ఇచ్చాము, వీటిలో చక్కటి పేరును ఎంచకోండి

Haritha Chappa HT Telugu
Published Apr 02, 2025 07:11 AM IST

Baby Names: బుజ్జి పాపాయి ఇంటికి రాగానే ప్రతి ఒక్కరూ అందమైన పేరు కోసం వెతకడం మొదలుపెడతారు.ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రత్యేకమైన పేర్లను పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. మీ బిడ్డకు ప్రత్యేకమైన, అర్థవంతమైన పేరు పెట్టాలనుకుంటే ఇక్కడ మేము కొన్ని బేబీ నేమ్స్ ఇచ్చాము.

అందమైన బేబీ నేమ్స్
అందమైన బేబీ నేమ్స్ (PC: Canva)

బిడ్డ పుట్టాక మొదల చేసే పని అతనికి ఒక అందమైన పేరు కోసం వెతకడం. ఈ పని సింపుల్ గా కనిపించినా ఎక్కువ సమయమే తీసుకుంటుంది. ఎంపిక చేసిన పేరు ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ నచ్చాలి.

పిల్లలకు పేరు వెతికేటప్పుడు అందమైన, సరైన పేరును ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పేరు గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. కొంతమంది బిడ్డ పుట్టకముందు నుంచే పేరును వెతుకుతూ ఉంటారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు అర్థవంతమైన పేరు ఇవ్వాలని కోరుకుంటారు. పిల్లల పేరు వారి వ్యక్తిత్వానికి సరిపోయేలా, వారి జీవితాలకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అమ్మాయిల కోసం కొన్ని ఉత్తమ పేర్లు ఇక్కడ ఉన్నాయి

గర్ల్ బేబీ నేమ్స్

  • అరుష: ఈ పేరుకు శక్తివంతమైన లేదా అద్భుతమైన అని అర్థం.
  • అయాన్షి: మగపిల్లల ఈ పేరు అరబిక్ మూలానికి చెందినది. దీని అర్థం అద్భుతమైనది లేదా భగవంతుడు ఇచ్చిన వరం.
  • హారిక: ఈ ప్రత్యేకమైన పేరు టర్కిష్ మూలానికి చెందినది. దీని అర్థం అద్భుతం.
  • అక్షయ: ఈ పేరు హిందీ మూలానికి చెందినది. సంస్కృత భాష నుండి ఉద్భవించింది. దీని అర్థం ఆశీర్వాదం లేదా అద్భుతం.
  • దేవాన్షి : ఆడబిడ్డకు పెట్టవలసిన అందమైన పేరు ఇది.అంటే భగవంతుని అనుగ్రహం.
  • శౌవిక: శౌవిక అనే పేరు ఆడబిడ్డకు చాలా మంచిది. ఈ పేరుకు మ్యాజిక్ తెలిసినవాడు అని అర్థం.
  • అహ్యా- అహ్యా అనేది హీబ్రూ పేరు, అంటే దేవుని అద్భుతం అని అర్థం.
  • అయా – ఈ పేరు చాలా ప్రత్యేకమైనది. అరబిక్ మూలానికి చెందినది. ఈ అందమైన పేరు అర్థం అద్భుతమైనది అని.
  • కరిష్మా- =ఈ పేరుకు హిందీ, సంస్కృత అర్థాలు అద్భుతం.
  • మావిష – మావిష అనేది అరబిక్ సంతతికి చెందిన అమ్మాయి పేరు. దీని అర్థం జీవితంలోని ఆశీర్వాదం లేదా జీవిత అద్భుతం.
  • అలిసా- ఇది స్కాటిష్ భాష నుండి ఉద్భవించిన ఒక పేరు.
  • ఆలియా: ఇది గ్రీకు, అరబిక్, హీబ్రూ నామం. దీని అర్థం అందమైనది, అద్భుతమైనది.
  • అమేలీ – ఇదొక జర్మన్ పదం. ఈ పేరుకు అర్థం కష్టపడి పనిచేసే వ్యక్తి అని.
  • ఆదియా – అంతే అందమైన బహుమతి అని అర్థం. దుర్గాదేవికి మరో పేరుగా చెప్పుకుంటారు.
  • ఆధ్యాత్మ – ఈ అందమైన పేరు మీనింగ్ ధ్యానం చేయడం అని.
  • అన్య – ప్రేమ దయతో నిండిన వ్యక్తి అని అర్థం.
  • అమైరా – ఈ పేరుకు అర్థం ఎప్పటికీ అందంగా ఉండే వ్యక్తి అని అర్థం
  • భవిని – భావోద్వేగాలు అధికంగా ఉండే అందమైన మహిళ
  • చార్వి – అ పేరుకు అర్థం అందమైన అమ్మాయి అని.
  • దీప్తా – ఈ పేరుకు అర్థం ప్రకాశవంతమైన అని.
  • ఫల్గుణి – ఈ పేరు ఆధునిక తరంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అందమైన అనే అర్థం వస్తుంది.
  • ఇషిత – ఉన్నతమైన వ్యక్తి అని అర్థం.
  • కశ్వి – ప్రకాశవంతంగా వెలిగే వ్యక్తి అని ఈ పేరుకు అర్థం.
  • మహికా – భూమి అని అర్థం. పొగమంచు అనే మీనింగ్ కూడా ఉంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024