Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: మీనాకు బాలు ప్రేమలేఖ – గడ్డివాము దగ్గర సరసాలు – మలేషియా మావయ్య ఎంట్రీ
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 2 ఎపిసోడ్‌లో గడ్డివాము దగ్గరకు రమ్మని మీనాకు లెటర్ రాసి కిటికీలో నుంచి విసిరేస్తాడు బాలు. ఆ లెటర్…ఇంట్లో వాళ్లకు ఒకరి తర్వాత మరికొకరికి చేరుతుంది. జంటలుగా ఒకరికి తెలియకుండా మరొకరు గడ్డివాము దగ్గరకు వస్తారు.
మటన్ కొట్టు మాణిక్యం పల్లెటూరికి రాకపోవడంతో రోహిణి కంగారు పడుతుంది. విద్యకు ఫోన్ చేస్తుంది. మలేషియా మావయ్య ఎప్పుడొస్తాడని పదే పదే తనను ప్రభావతి అడుగుతుందని విద్యతో అంటుంది రోహిణి. అత్తకు ఏం చెప్పాలో తెలియడం లేదని టెన్షన్ పడుతుంది.
మటన్ కొట్టు మాణిక్యాన్ని నమ్మి డబ్బు, నగలు అన్ని ఇచ్చామని, అవి తీసుకొని పారిపోడు కదా అని విద్యతో అంటుంది రోహిణి. మటన్ కొట్టు మాణిక్యానికి యాక్టింగ్ అంటే పిచ్చి అని, తప్పకుండా పల్లెటూరికి వస్తాడని రోహిణి భయాన్ని పొగొడుతుంది విద్య.
బాలు ఫిదా…
మీనా చీరలో అందంగా ముస్తాబవుతుంది. ఆమె గ్లామర్‌కు బాలు ఫిదా అయిపోతాడు. మీనా భుజంపై చేయివేసి ఆమెను బెడ్‌పై కూర్చోమని అంటాడు. కానీ మీనా కూర్చోవడానికి ఒప్పుకోదు. అమ్మమ్మ రూమ్ ఇదని చెబుతుంది. బామ్మ ఎక్కడైనా పడుకుంటుందని బాలు అంటాడు.
రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుశీల…బాలును బలవంతంగా బయటకు పంపిస్తుంది. మీనాను మాత్రం తన రూమ్‌లోనే ఆర్డర్ వేస్తుంది సుశీల. ఇక్కడ ఉన్నంత కాలం మీనా నా రూమ్‌లోనే పడుకుంటుందని సుశీల అంటుంది.
బాలుకు పనిష్‌మెంట్…
శోభనం ఏర్పాటుచేసినప్పుడు గోడదూకి పారిపోయినందుకు ఇదే నేను నీకు విధిస్తున్న పనిష్‌మెంట్ అని బాలుతో అంటుంది సుశీల. నేను వెళుతున్న అంటూ బాలు కదలకుండా అక్కడే ఉంటాడు.
పోతున్న అంటూ కదలవేంటి అంటూ బాలును గెంటేస్తుంది సుశీల. అప్పుడప్పుడు ఇలా దూరం పెడితేనే బాలు నీ కొంగు పట్టుకొని తిరుగుతాడని మీనాతో అంటుంది సుశీల.
మీనాకు లెటర్ రాసిన బాలు…
అందరూ పడుకున్న తర్వాత మీనాను గడ్డివాము దగ్గరకు రమ్మని ఓ పేపర్‌లో రాస్తాడు బాలు. ఆ లెటర్‌ను ఉండలా చూట్టి కిటికీలో నుంచి మీనా ముందుకు విసురుతాడు. కానీ అనుకోకుండా ఆ లెటర్ మనోజ్ ముందు పడుతుంది. అది రోహిణి రాసిందని మనోజ్ సంబరపడిపోతాడు.
ఆ లెటర్ చదివి పక్కనున్న కిటికీలోకి విసిరేస్తాడు. ఆ లెటర్ శృతి ముందు పడుతుంది. అది చదివిన శృతి….రవి రాసాడు అనుకొని సిగ్గుపడుతుంది. ఆ లెటర్ రవికి ఇస్తుంది శృతి. భార్యే ఈ లెటర్ రాసి తనకు ఇచ్చిందని రవి అపోహ పడతాడు.
సత్యం ప్రేమలేఖలు…
రవి విసిరేసిన ఆ లెటర్ ప్రభావతిపై పడుతుంది. సత్యం చేతిలో పెన్ను పేపర్ కనిపించడంతో భర్తే ఈ లెటర్ రాసి ఉంటాడని అనుకుంటాడు. తనకు ప్రేమ లేఖలు రాస్తున్నాడని సంబరపడిపోతూ ఆ లెటర్‌ను భర్త జేబులో పెట్టి వెళ్లిపోతుంది. ప్రభావతి ఆ లెటర్ రాసిందని సత్యం అనుకుంటాడు.
కాపురానికి వచ్చిన కొత్తలో ఎక్కువగా కలిసేది అక్కడే కాబట్టి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి ప్రభావతి తనను గడ్డివాము దగ్గరకు రమ్మని ఉంటుందని సత్యం ఆనందపడతాడు. బాలు రాసిన లెటర్ తిరిగి మీనా దగ్గరకు వస్తుంది. కిటికీ దగ్గర బాలు కనిపించడంతో ఇది మీ పనేనా అని అడుగుతుంది. అవునని బాలు అంటాడు.
మీనా యాక్టింగ్…
సుశీల నిద్రపోయిన తర్వాత మీనాను పిలుస్తాడు బాలు. మెలుకువగానే ఉన్న నిద్రపోయినట్లుగా మీనా నటిస్తుంది. మీనాను బయటకు రమ్మని బతిమిలాడుతాడు. మీనా రానని చెప్పి నిద్రపోతుంది. మీనా నిద్రను డిస్ట్రబ్ చేస్తాడు బాలు.
మలేషియా మావయ్య గుట్టు…
చివరకు బాలు కోసం గడ్డి వాము దగ్గరకు వస్తుంది మీనా. బాలు తనను ప్రేమతో పిలిచాడని మీనా అపోహపడుతుంది. అంతలేదని బాలు సమాధానమిస్తాడు. పార్లరమ్మ వ్యవహారం అంతుచిక్కడం లేదని, మలేషియా మావయ్య గుట్టు రట్టు ఎలా చేయాలో మాట్లాడటానికి పిలిచానని బాలు అంటాడు. టాపిక్ అదే అయితే వెళ్లిపోతానని మీనా అంటుంది. వెళ్లిపోతున్న మీనాను చెయ్యి పట్టి లాగుతాడు బాలు. బాలుపై పడిపోతుంది మీనా. ఇద్దరు పాటలు పాడుకుంటారు.
రోహిణి…మనోజ్ ఎంట్రీ…
బాలు, మీనా ఊహల్లో తేలిపోతుండగా అక్కడికి మనోజ్, రోహిణి వస్తారు. వారిని చూడగానే మీనా, బాలు దాక్కుంటారు. బండబాలుగాడు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అంటూనే ఉన్నాడని, ప్రశాంతత కోసం ఇక్కడికి తీసుకొచ్చానని రోహిణితో అంటాడు మనోజ్. ఇప్పుడు బండబాలు టాపిక్ ఎందుకు అని రోహిణి బదులిస్తుంది.
పబ్బీ అంటూ పిలుపు…
అప్పుడే అక్కడికి రవి, శృతి వస్తారు. వారిని చూసి మనోజ్, రోహిణి కూడా దాక్కుంటారు. గడ్డివాముకు మరోవైపు సత్యం, ప్రభావతి మాట్లాడుకోవడం చూసి మనోజ్, బాలు, రవి కంగారుపడతాడు. ప్రభావతిని పబ్బీ అంటూ ప్రేమగా పిలుస్తాడు సత్యం. నిన్ను ఇలా ప్రశాంతంగా చూసి చాలా రోజులైందని అంటాడు.
ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు.
గడ్డి వాము దగ్గర మాటలు వినిపించడంతో సుశీల బయటకు వస్తుంది. దొంగలు అనుకొని పొరపడి కేకలు వేస్తుంది.ఆమె అరుపులకు అందరూ బయటకు వస్తారు. ఒకరిని మరొకరు చూసి కంగారు పడతారు. కొడుకులు, కోడళ్లకు దొరికిపోయామని ప్రభావతి అంటుంది. నాతో మాట్లాడుతానని సత్యం లెటర్ రాస్తానంటే గడ్డివాము దగ్గరకు వచ్చానని ప్రభావతి అంటుంది.
అది నువ్వు రాసింది కాదా అని మనోజ్‌ను రోహిణి అడుగుతుంది. ఆ లెటర్ నువ్వు రాయలేదా రవిని శృతి అడుగుతుంది. ఆ లెటర్ మీనా కోసం తాను రాసిందని బాలు అసలు నిజం బయటపెడతాడు. దాంతో అందరూ సెలైంట్‌గా ఇంట్లోకి వెళ్లిపోతారు.
మలేషియా మావయ్య ఎంట్రీ…
మలేషియా మావయ్యలా పల్లెటూరికి వస్తాడు మటన్ కొట్టు మాణిక్యం. కుక్కలు వెంటపడటంతో వారికి దొరక్కుండా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి కుడితిలో పడతాడు. అతడి వాలకం చూసి మలేషికా నుంచి వచ్చాడంటే ఎవరూ నమ్మరు. ఆ కుడితిలో ఇంకొన్ని కూరగాయ ముక్కలు వేసి ఉంటే మేకలు బాగా తింటాయని నోరు జారుతాడు మటన్ కొట్టు మాణిక్యం. అతడి మాటలతో రోహిణి కంగారు పడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.