




Best Web Hosting Provider In India 2024

Sangareddy Murders: వీడిన అమీన్‌పూర్ చిన్నారుల మరణాల మిస్టరీ.. వివాహేతర సంబంధంతో పిల్లల్ని చంపేసిన తల్లి
Sangareddy Murders: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లల మృతి కేసులో మిస్టరీ వీడింది.ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తల్లే చంపేసినట్టు పోలీసులు తేల్చారు.27వ తేదీ రాత్రి పెరుగన్నంలో విషం కలిపి భర్త, పిల్లలకు తినిపించాలని ప్లాన్ చేసినా చివరిలో భర్త బయటకు వెళ్లి పోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో గత వారం విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటనలో మిస్టరీ వీడింది. ప్రియుడి మోజులో కన్నతల్లే పిల్లలకు విషమిచ్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యలు జరిగినట్టు తొలుత ప్రచారం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిని ఆస్పత్రికి తరలించారు.
సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో 27వ తేదీ రాత్రి విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందడం సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా పిల్లలకు విషం తినిపించి ప్రాణాలు తీసినట్టు మొదట భావించారు. ఈ ఘటనలో సాయికృష్ణ, మధు, గౌతమ్ అనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే తండ్రి ఇంటికి వచ్చే సరికి భార్య రజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న రజితను బీరంగూడ ఆస్పత్రికి తరలించారు. ఇంటికి సమీపంలో ఉన్న దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు కలుపుకుని అన్నం తింటుండగా స్పృహ కోల్పోయినట్టు పోలీసులకు తెలిపింది. తర్వాత ఏమి జరిగిందో తెలియదని చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రజిత ఆత్మహత్యాయత్నం చేసిందా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
భర్త పిల్లల్ని వదిలంచుకోవాలని..
అమీన్‌పూర్‌కు చెందిన రజిత, చెన్నయ్య దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాల నేపథ్యంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం రజిత చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాత స్నేహితుడిని రజిత కలుసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తతో విభేదాల నేపథ్యంలో అతని నుంచి విడిపోవాలని రజిత భావించింది.
ఈ క్రమంలో 27వ తేదీ గురువారం భర్త, పిల్లలకు విషం కలిపిన అన్నం తినిపించాలని ప్లాన్ చేసింది. రాత్రి పెరుగు అన్నంలో విషం కలిపి తినిపించింది. అన్నం తినే సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నాడు. నీళ్ల ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేసే రజిత భర్తకు బయట నుంచి ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. భర్త బయటకు వెళ్లిన తర్వాత విషం కలిపిన ఆహారాన్ని పిల్లలకు తినిపించింది.
దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు. భర్త ఇంటికి వచ్చేసరికి కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు నటించింది. దీంతో ఆమెను హుటాహుటిని బీరంగూడా ఆస్పత్రికి తరలించారు. రజిత తల్లిదండ్రులు అల్లుడు చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు చెన్నయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో రజిత నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం ఆమెతో పాటు ప్రియుడిని అమీన్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్