


Best Web Hosting Provider In India 2024

Mystery Thriller Movie: తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
Mystery Thriller Movie: తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కే 13 తెలుగులో రిలీజైంది. సేమ్ టైటిల్‌తో యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. అరుళ్‌నిధి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహించాడు.

Mystery Thriller Movie తమిళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కే 13 తెలుగులోకి వచ్చింది. కే 13 పేరుతోనే యూట్యూబ్‌లో రిలీజైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో అరుళ్‌నిధి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. కే 13 మూవీకి భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో గాయత్రి, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. సామ్ సీఎస్ మ్యూజిక్ సమకూర్చాడు.
కమర్షియల్ హిట్…
2019లో థియేటర్లలో రిలీజైన ఈ తమిళ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కథ మొత్తం దాదాపుగా ఒకే రూమ్‌లో సాగుతుంది. కాన్సెప్ట్‌తో పాటు అరుళ్‌నిధి, శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా సినిమాలోని ట్విస్ట్‌లను దర్శకుడు డిఫరెంట్‌గా రాసుకున్నాడు. ఊహలకు అందని ట్విస్ట్‌తో క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. కే 13 తెలుగు వెర్షన్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తమిళ వెర్షన్‌ను సన్ నెక్స్ట్‌లో చూడొచ్చు.
కే 13 కథ ఇదే…
మహేష్ ప్రసాద్ (అరుళ్ నిధి) సినిమా డైరెక్టర్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అతడికి ఓ రోజు పబ్‌లో మయాశ్రీ (శ్రద్ధా శ్రీనాథ్( పరిచయం అవుతుంది. తాగిన మత్తులో ఆమెతో కలిసి ఓ ఫ్లాట్‌కు వెళతాడు మహేష్. ఆ తర్వాత రోజు ఉదయం లేచేసరికి మహేష్ కట్టిపడేసి ఉంటాడు. అదే రూమ్‌లో మాయశ్రీ హత్యకు గురై కనిపిస్తుంది. అసలు మాయశ్రీని ఎవరు చంపారు? ఎవరికి కనిపించకుండా మహేష్ ఆ ఫ్లాట్ నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఆ ఫ్లాట్‌కు ఎవరెవరు వచ్చారు? మాయశ్రీ హత్య నిజంగా జరిగిందా? అదంతా ఓ సినిమా కథనా? అన్నదే కే 13 మూవీ కథ.
జెర్సీతో టాలీవుడ్ ఎంట్రీ…
నాని జెర్సీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. తొలి సినిమాలోనే తల్లి పాత్రలో కనిపించి వైవిధ్యతను చాటుకుంది. గ్లామర్, హీరోయిన్ పాత్రలకే పరిమితం కావాలనే రూల్ పెట్టుకోకుండా మెకానిక్ రాకీతో పాటు మరికొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది. ఈ ఏడాది డాకుమహారాజ్‌లో సర్‌ప్రైజింగ్ రోల్‌లో కనిపించింది.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో…
తెలుగులోనే కాకుండా కన్నడం, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ ప్రతిభను చాటుకుంటోంది. మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో హీరోగా తమిళ ప్రేక్షకులకు చేరువయ్యాడు అరుళ్‌నిధి.
సంబంధిత కథనం