Tandoori Vankaya Masala: తందూరీ వంకాయ మసాలా కర్రీ ఎప్పుడైనా తిన్నారా? మటన్, చికెన్ కర్రీ కూడా దీని ముందు తేలిపోతాయి

Best Web Hosting Provider In India 2024

Tandoori Vankaya Masala: తందూరీ వంకాయ మసాలా కర్రీ ఎప్పుడైనా తిన్నారా? మటన్, చికెన్ కర్రీ కూడా దీని ముందు తేలిపోతాయి

Haritha Chappa HT Telugu
Published Apr 02, 2025 11:30 AM IST

Tandoori Vankaya Masala: తందూరీ వంకాయ మసాల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఎంతో టేస్టీగా వస్తుంది. మటన్, చికెన్ కన్నా ఈ తందూరి వంకాయ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ చాలా.

తందూరీ వంకాయ మసాలా కర్రీ
తందూరీ వంకాయ మసాలా కర్రీ

వంకాయ రెసిపీలు ఎన్నో తినే ఉంటారు. ఒకసారి ప్రత్యేకంగా తందూరీ స్టైల్లో వంకాయ మసాలా కర్రీ చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. దీని ముందు చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా తేలిపోతుంది. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా చేస్తే చాలా సులువుగా కర్రీ సిద్ధమైపోతుంది. ఈ తందూరీ వంకాయ మసాలా కర్రీ కోసం పొడవుగా ఉండే వంకాయలను తీసుకోవాలి. అలా అయితేనే ఈ కర్రీ అద్భుతంగా వస్తుంది.

తందూరి వంకాయ మసాలా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

వంకాయలు – ఐదు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు

జీడిపప్పులు – పది

పసుపు – పావు స్పూను

కారం – ఒక స్పూను

తందూరి మసాలా పొడి – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

పెరుగు – పావుకప్పు

ఆవనూనె – రెండు స్పూన్లు

గరం మసాలా – అర స్పూను

నెయ్యి – రెండు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

తందూరీ వంకాయ మసాలా కర్రీ రెసిపీ

1. వంకాయలను నిలువుగా ఉండేవి తీసుకోవాలి. ఒక్కో వంకాయను రెండు నిలువు ముక్కలుగా కోసుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, వేసి బాగా కలుపుకోవాలి.

3. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. ఈ మిశ్రమంలోనే ఒక స్పూను ఆవనూనెను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

4. ఇందులో వంకాయలను వేసి ఈ పేస్టును వాటికి బాగా పట్టేలా చేసి మేరినేట్ చేసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె, రెండు స్పూన్ల నెయ్యి వేయాలి.

6. నూనె, నెయ్యి వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కలను ఇందులో వేసి అన్ని వైపులా వేయించుకోవాలి.

7. ఈ వంకాయ ముక్కలు 70 శాతం వేగిపోయాక పక్కన మిగిలిపోయిన మసాలా మేరినేషన్ పేస్టును వేసి కలపాలి.

8. అలాగే కొంత పెరుగును కూడా వేసి కలుపుకోవాలి.

9. పెరుగును కూర అంతా కలిసేలా మెల్లగా కలపాలి.

10. చిన్న మంట మీద దాన్ని అలా దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి.

11. నూనె పైకి తేలుతుంటే వంకాయ ఉడికిందని అర్థం.

12. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.

13. అంతే తందూరీ వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే.

14. ఒక్కసారి తిన్నారంటే మీరు దీన్ని మర్చిపోలేరు.

వైట్ రైస్ లో ఈ వంకాయ తందూరి వంకాయ మసాలా కలుపుకొని చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. దీని ముందు చికెన్, మటన్ కర్రీలు కూడా తేలిపోతాయి. దీన్ని చేయడానికి చాలా తక్కువ పదార్థాలు అవసరం పడతాయి, కానీ చాలా రుచిగా ఉంటాయి. వంకాయ ఇష్టపడని వారు కూడా ఈ కూరను కచ్చితంగా తింటారు. అంత రుచిగా ఉంటుంది ఈ తందూరీ వంకాయ మసాలా కూర.

వంకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వంకాయను మధుమేహ రోగులు తింటే ఎంతో ఆరోగ్యం.ఇది జీర్ణక్రియ రేటును పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని కూడా కాపాడుతుంది. వంకాయ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కణాల ఆక్సీకరణ నష్టం నుంచి మనల్ని రక్షిస్తుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024