


Best Web Hosting Provider In India 2024

OTT Telugu Movies: ఈనెల ఒకే ఓటీటీలో ఏడు తెలుగు సినిమాల రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
OTT Telugu Movies: ఈటీవీ విన్ ఓటీటీలో ఈనెల సినిమాలు క్యూ కట్టేందుకు సిద్ధమయ్యాయి. ఏడు చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. వీటి తేదీలను ఈటీవీ విన్ వెల్లడించింది.

తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘ఈటీవీ విన్’ వరుసగా సినిమాలు, సిరీస్‍లను తీసుకొస్తోంది. ఇటీవల ఈ ఓటీటీ మరింత దూకుడు పెంచింది. నయా కంటెంట్‍ను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈనెల ఏప్రిల్‍లోనూ ఈటీవీ విన్‍లో కొన్ని సినిమాలు అడుగుపెట్టనున్నాయి. ఏడు చిత్రాలు రానున్నాయి. వాటి స్ట్రీమింగ్ తేదీలను ఈటీవీ విన్ నేడు (ఏప్రిల్ 2) ప్రకటించింది.
ఉద్వేగం
ఉద్వేగం సినిమా రేపు (ఏప్రిల్ 3) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీలో త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం గతేడాది నవంబర్ 29వ తేదీన థియేటర్లలో విడులదైంది. నాలుగు నెలల తర్వాత ఉద్వేగం చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తోంది. ఈ మూవీకి మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ఒకే రోజు రెండు
ఏప్రిల్ 6వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో ‘ఉత్తరం’, ‘లైఫ్ పార్ట్‌నర్’ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ప్రతీ వారం ఓ స్టోరీ అనే కాన్సెప్ట్ కథాసుధలో భాగంగ లైఫ్ పార్ట్‌నర్ వస్తోంది. ఇది తక్కువ నిడివితో దాదాపు ఓ షార్ట్ ఫిల్మ్‌లా ఉండొచ్చు. లవ్ స్టోరీతో ఈ మూవీ ఉండనుంది.
20 రోజుల్లోనే ఓటీటీలోకి..
టుక్ టుక్ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 10వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ డ్రామా చిత్రంలో హర్ష్ రోహణ్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమాకు సుప్రీత్ సీ కృష్ణ దర్శకత్వం వహించారు. గత నెల మార్చి 21నే ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. 20 రోజుల్లోగానే ఈటీవీ విన్‍లో ఈ మూవీ అడుగుపెడుతోంది.
మరో మూడు సినిమాలు
ఏప్రిల్ 20వ తేదీన ఈటీవీ విన్‍లో ‘వెండి పట్టీలు’ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఫ్యామిలీ డ్రామా చిత్రంగా ఇది ఉండనుంది. ఏప్రిల్ 24వ తేదీన ‘కొత్తకొత్తగా’ సినిమా ఈటీవీ విన్‍లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా థియేటర్లలో 2022 సెప్టెంబర్ నెలలో విడుదలైంది. రెండున్నరేళ్ల తర్వాత ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో అజయ్ అమన్, వృతి వర్గని, కల్యాణి నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తకొత్తగా చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వం వహించారు.
ట్రింగ్ ట్రింగ్ సినిమా ఏప్రిల్ 27వ తేదీన ఈటీవి విన్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. ఈ సినిమాలు ఏప్రిల్‍లో రానున్నాయని ఈటీవీ విన్ నేడు వెల్లడించింది. “ఈ ఏప్రిల్‍లో ఈటీవీ విన్ సమ్మర్ బ్లాక్‍బస్టర్లను తెస్తోంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‍మెంట్ కోసం సిద్ధంగా ఉండండి” అని ట్వీట్ చేసింది ఈటీవీ విన్.
ఈటీవీ విన్‍లో రీసెంట్‍గా మధుశాల సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీని డైరెక్టర్ జీ సుధాకర్ తెరకెక్కించారు. మనోజ్ నందం, యానీ, ఇనయా సుల్తానా కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
సంబంధిత కథనం